భవిష్యత్ తరాలకు అందించాలి


Sun,August 25, 2019 02:13 AM

జూలపల్లి : నీటిని సంరక్షించి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని ఇన్‌చార్జి ఎంపీడీఓ రమాదేవి పేర్కొన్నారు. మండలంలో శనివారం నీటి సంరక్షణ, పచ్చదనం, పరిశుభ్రతపై జూలపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ప్రత్యేక గ్రామ సభలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ, భూగర్భ జలాలను రక్షించుకోడానికి నిర్మించుకున్న ఇంటికో ఇంకుడు గుంత లను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. గ్రామాల్లో వంద శాతం ఇంకుడు గుంతల నిర్మాణాలు పూర్తయితే తప్పకుండా మురుగు కాల్వలు పూడ్చివేస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఇక్కడ మం డల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దారబోయిన నరసింహం, ఇన్‌చార్జి ఈఓపీఆర్డి లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...