టీఆర్‌ఎస్ గ్రామ కమిటీల ఎన్నిక


Sun,August 25, 2019 02:13 AM

కాల్వశ్రీరాంపూర్ : మండలంలోని కిష్టంపేట టీఆర్‌ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడితో పాటు, అనుబంధ సంఘాల అధ్యక్షులను శవివారం ఏకగ్రీవంగా నియమించినట్లు టీఆర్‌ఎస్ ఎన్నికల పరిశీలకులు తెలిపారు. గ్రామ శాఖ అధ్యక్షుడిగా అనవేన సురేశ్, యూత్ అధ్యక్షుడిగా పల్లెర్ల హరీశ్, రైతు కమిటీ అధ్యక్షుడిగా కర్ర సుధాకర్‌రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా మిట్టపెల్లి రాజయ్య, మైనార్టీ అధ్యక్షుడిగా ఎండీ రజాక్, మహిళా అధ్యక్షురాలిగా పల్లెర్ల శోభ, బీసీ సెల్ అధ్యక్షుడిగా ము ల్కోజు సదానందంను ఏకగ్రీవంగా నియమించారు. కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు పల్లె కుమార్‌గౌడ్, మ్యాడగోని శ్రీకాంత్‌గౌడ్, గోపు నారాయణరెడ్డి, బుద్దె పోశెట్టి, జీల తిరుపతి, గట్టు శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి గ్రామ కన్వీనర్ దానవేన రవి, ఉప సర్పంచ్ పల్లెర్ల రమేశ్ పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన పార్టీ అధ్యక్షులను సర్పంచ్ కాసర్ల తిరుపతిరెడ్డి కండువావేసి అభినందించారు. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆదేశాల మేరకు కమిటీలు వేశామని వివరించారు.

ఉప్పరపల్లిలో..
ఓదెల: ఉప్పరపల్లి టీఆర్‌ఎస్ పార్టీ గ్రామ కమిటీని నియమించారు. సర్పంచ్ పల్లె ఓదెలు అధ్యక్షతన సమావేశమైన ఆ పార్టీ కార్యకర్తలు నూతన కమిటీ నియమించుకున్నారు. అధ్యక్షుడిగా కనుకుంట్ల సాయి లు, ఉపాధ్యక్షులుగా ఏనుగుల సదయ్య, బైరి హంసరాజు, ప్రధాన కార్యదర్శిగా మ్యాకల రమేశ్, కార్యదర్శులుగా కొప్పుల రాజయ్య, పులిపాక లింగయ్య, ప్రచార కార్యదర్శిగా చిలుక శ్రీనివాస్, కోశాధికారిగా కనుకుంట్ల నందయ్య, మరో ఏడుగురు కార్యవర్గ సభ్యులతో కమిటీ నియామకాన్ని చేపట్టారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...