పీహెచ్‌సీకి జాతీయ నాణ్యత నిర్ధారణ బృందం


Sat,August 24, 2019 01:32 AM

కమాన్‌పూర్: మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జాతీయ నాణ్యత నిర్ధారణ బృందం సభ్యులు శుక్రవారం సందర్శించారు. జాతీయ ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ నుంచి వచ్చిన వైద్యులు మోహన్ పుష్పిందర్, పంకజ్ తల్రేజా రెండు రోజల పాటు దవాఖానలో పలు అంశాలను పరిశీలించారు. పీహెచ్‌సీకి వచ్చే రోగుల సంఖ్య, వారికి అందించే వైద్య సదుపాయాలు, సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారా.. వైద్యం కోసం వచ్చే ప్రజలకు సత్ప్రవర్తనతో మెలుగుతున్నారా తదితర విషయాలను వైద్యాధికారి అశోక్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. అలాగే కేసీఆర్ కిట్, దవాఖానలో ఇప్పటి వరకు చేసిన ప్రసవాల వివరాలను తెలుసుకున్నారు.

పలు రకాల రికార్డులతో పాటు దవాఖానలోని వార్డులు, మం దుల నిల్వ, ఆపరేషన్ గది, రోగ నిర్ధారణ పరీక్షలు చేసే గదులను పరిశీలించారు.కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి ప్రమోద్‌కుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వసంతరావు, సీహెచ్‌ఓ ప్రతాప్‌రెడ్డి తదితరులున్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...