సింగరేణి స్థలాలకు దరఖాస్తు చేసుకోండి


Sat,August 24, 2019 01:32 AM

గోదావరిఖని,నమస్తే తెలంగాణ: సింగరేణి సంస్థ స్థలాల్లో నివాసం ఉంటున్న వారు తమ ఇండ్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు సెప్టెంబర్ 10లోగా దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ వనజాదేవి తెలిపారు. రామగుండం డివిజన్‌లోని సింగరేణి భూములను శుక్రవా రం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. 2 జూన్, 2014కు పూర్వం సింగరేణి స్థలాల్లో ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న ప్రజలు రెగ్యులరైజ్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వివరించారు. దారిద్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు వంద గజాల లోపు ఉన్న ఇండ్లను ఉచితంగా రెగ్యులరైజేషన్ చేస్తామనీ, వంద నుంచి 500 గజాలు ఉన్న వాటికి గజానికి 25 ఫీజుతో రెగ్యులరైజేషన్ చేయబడుతుందనీ, 501 నుంచి వెయ్యి గజాలు ఉన్న నివాస గృహాలకు గజానికి 250ల ఫీజుతో రెగ్యులరైజ్ చేస్తారనీ, 500 గజాల వరకు ఉన్న వాణిజ్య స్థలాలకు గజానికి వంద చొప్పున వెయ్యి గజాల వరకు ఉన్న వాణిజ్య భవనాలకు 500 గజం చొప్పున రెగ్యులరైజ్ చేస్తారని వివరించారు.

వెయ్యి గజాలకు పైగా ఉన్న వాణిజ్య స్తలాలకు ప్రస్థుత మార్కెట్ విలువ ప్రకారం రెగ్యులరైజ్ చేయబడుతుందన్నారు. సింగరేణి భూములు, మండలాల సర్వేయర్లు, గ్రామ రెవెన్యూ అధికారులు, సింగరేణి సర్వేయర్లు, మున్సిపల్ టౌన్ ప్లానింగ్‌తో కూడిన బృందాలను పెద్దపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి ఏర్పాటు చేశారని తెలిపారు. రామగుండం-1,2 నందు సర్వే చేపట్టి ఇంటి విస్తీర్ణం నమోదు చేస్తారనీ, వాటిని ఇంటి అడ్రస్‌లపై రాస్తారని తెలిపారు. సదరు వ్యక్తులు వారి ఆధార్ కార్డు ఇంటి డాక్యుమెంట్లు, ఇంటి పన్ను రసీదు, కరెంటు బిల్లు, రేషన్ కార్డు మొదలైన వాటితో మీసేవలో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...