ఆదర్శ పాఠశాలల్లో ఫ్రెషర్స్‌డే వేడుకలు


Sat,August 24, 2019 01:32 AM

ధర్మారం: మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో ఫ్రెషర్స్‌డే వేడుకలు శుక్రవారం ఘనంగా చేపట్టారు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు సెకండియర్ విద్యార్థులు స్వాగతం పలికారు. ఈ వేడుకలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీ సభ్యురాలు పూస్కూరు పద్మజ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మన్నె దీన, ఎంఈఓ పినుమల్ల ఛాయాదేవి, పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు రాజేశం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కాల్వశ్రీరాంపూర్ : మల్యాల మోడల్ స్కూల్ లో శుక్రవారం నిర్వహించిన ప్రెషర్స్ డే హంగామా అలరించింది. ఈ సందర్భంగా ప్రథమ సంవత్సరం విద్యా ర్థులకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ నూనేటి సంపత్, జడ్పీ సభ్యుడు వంగళ తిరుపతిరెడ్డి హాజరై మాట్లాడారు. జాతీయ స్థాయిలో స్కాలర్ షిప్‌నకు ఎంపికైన పూర్వ విద్యార్థి ఎండీ సౌధను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జూకంటి శిరీష, కోఆప్షన్ సభ్యుడు ఎండీ ఇబ్రహీం, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...