కాళేశ్వరం జలాలతో శివుడికి అభిషేకం


Sat,August 24, 2019 01:31 AM

రాంమందిర్ ఏరియా: రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని జనగామ గ్రామ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అపర భగీరథుడిగా కొలిచారు. కాళేశ్వరం త్రివేణి సంగమం నుంచి ఎదురెక్కి పారుతున్న గోదావరి జలాలను తాము ఇంతవరకు చూడలేదనీ, ఆ మహా భాగ్యం ముఖ్యమంత్రితోనే కలిగిందన్నారు. ఈ మేరకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆదేశాల మేరకు జనగామ గ్రామానికి చెందిన దాతు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామస్తులు సమీపంలోని గోదావరి నదికి మూకుమ్మడిగా వెళ్లి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి సంప్రదా యం ప్రకారం సారె సమర్పించారు. అనంతరం 108 బిందెలతో గోదావరి జలాలను తీసుకవచ్చి శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శివునికి అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా దాతు శ్రీనివాస్ మాట్లాడుతూ ఎప్పుడూ గోదావరి జలాలు దిగువకు వెళ్లడమే చూశాము గానీ... అవే జలాలను ఎదురెక్కి పారించిన చరిత్ర ఒక్క కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అర్చకులు రుద్రభట్ల రమేశ్ శర్మతోపాటు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...