సేవకు మారుపేరే సత్యసాయి


Sat,August 24, 2019 01:30 AM

కలెక్టరేట్: సేవకు మారుపేరుగా సత్యసాయి సేవా సమితి పని చేస్తుందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ దవాఖాన ఆవరణలో సత్యసాయి సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన సేవా పథకం ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సత్యసాయి సేవా సమితి ట్రస్టు ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలాబాగుంటాయని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 దవాఖానల్లో సత్యసాయి సేవా సమితి నిత్యాన్నదాన సేవా పథకం నిర్వహిస్తుండడం అభినందనీయమని కొనియాడారు. ఇప్పటి దాకా 12,500 మందికి అన్నదానం నిర్వహించడం అభినందించాల్సిన విషయమన్నారు.

సత్యసాయి ట్రస్టులో పని చేసే వారు చాలా నిబద్ధత, సేవాతత్వంతో పని చేస్తారని మంత్రి ప్రశంసించారు. ఆకలి అయిన వాళ్లకే అన్నం విలువ తెలుస్తుందని నిరుపేదలు సుదూర ప్రాంతాల నుంచి ప్రభు త్వ దవాఖానలకు వైద్యం కోసం వచ్చే వారికి నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషకరమన్నారు. పుష్కరాల సమయంలో జిల్లాలోని పుష్కరఘాట్‌ల వద్ద సత్యసాయి సేవా సమితి సభ్యులు చేస్తున్న కార్యక్రమాలను చూసి ఆశ్చర్యపోయామని గుర్తు చేశా రు. అనంతరం జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ మాట్లాడుతూ కొన్ని ఫంక్షన్లలో పెద్ద ఎత్తున భోజనాన్ని వృథా చేస్తూ పడవేస్తున్నారన్నారు. అదే సమయంలో కొన్ని ప్రదేశాల్లో ఆకలితో అలమటించే వారి బాధలను ఒకసారి మననం చేసుకోవాలన్నారు. మహాదేవుపూర్‌లోని ప్రభుత్వ దవాఖాన వద్ద ఇలాంటి కార్యక్రమం నిర్వహించడానికి సంకల్పించామని ఎన్నికల నేపథ్యంలో ముందుకు సాగలేదన్నారు.

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం కోసం వచ్చే పేదలతో పాటు వారి వెంట ఉండే సహాయకులకు భోజనం అందించాలనే ఆలోచన రావ డం, సేవాతత్వంతో సత్యసాయి ట్రస్టు సభ్యులు ముం దుకొచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు తమవంతు సహాయం ఉంటుందని భవిష్యత్తులో కూడా మరింత ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రిని సత్యసాయి సేవా సమితి సభ్యులు శాలువాతో సన్మానించగా సేవలో తరించిపోతున్న సభ్యులను సైతం మంత్రి, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే, జేసీ సన్మానించారు. ఇదిలా ఉండగా సత్యసాయిబాబా తనకు కలలోకి వచ్చి పేదలకు అన్నం పెట్టేవారికి అండగా ఉండాలని చెప్పాడంటూ పెద్దపల్లికి చెందిన నాగులమల్యాల కనుకమ్మ తన పింఛన్ డబ్బుల నుంచి 516ను సత్యసాయి సేవా సంస్థ సభ్యులకు అందజేసింది. కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు, పెద్దపల్లి జోన్ డీసీపీ సుదర్శన్‌గౌడ్, పెద్దపల్లి సత్యసాయి సేవా సంస్థ అధ్యక్షుడు వెంకటస్వామి, సభ్యులు మల్లేశ్వరి, భాగ్యలక్ష్మి, హన్మంతరావు, అశోక్‌రెడ్డి, భాష తదితరులు పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...