బలీయమైన శక్తిగా టీఆర్‌ఎస్


Sat,August 24, 2019 01:30 AM

కలెక్టరేట్ : సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ బలీయమైన శక్తిగా ఎదుగుతున్నదని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని దాసరి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకుని క్రియాశీలకంగా ఉండడాన్ని తెలంగాణ బిడ్డలుగా ప్రతి ఒక్కరూ గర్వం గా భావించుకోవాలన్నారు. గ్రామ కమిటీల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ పార్టీకీ లేనటువంటి సభ్యత్వం టీఆర్‌ఎస్‌కు ఉందనీ, 60 లక్షల మంది సభ్యత్వమున్న అతిపెద్ద పార్టీగా టీఆర్‌ఎస్ అవతరించిందని పేర్కొన్నారు.

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 28లోగా మండల, గ్రామ కమిటీల ఏర్పాటును పూర్తి చేసి, కేంద్ర కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. ఇం దుకోసం గ్రామాలకు, మండలాలకు ప్రత్యేకంగా పరిశీలకులను నియమించినట్లు చెప్పారు. పార్టీలో చురుగ్గా పని చేసేవారికే గ్రామ కమిటీల్లో అవకాశం కల్పించాలన్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో గ్రామాల్లో పర్యటించి కమిటీలన్నింటినీ ఏర్పాటు చేయాలని పరిశీలకులను ఆదేశించారు. మహిళా కమిటీలు, యూత్ కమిటీలు, రైతు కమిటీలు, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ కమిటీలు, కార్మి క, సాంస్కృతిక కమిటీలను పూర్తి స్థాయిలో ఉండేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జీ రఘువీర్‌సింగ్, ఎంపీపీ బాలాజీరావు, జడ్పీటీసీ బొద్దుల లక్ష్మీనర్సయ్య, నాయకులు బుర్ర శ్రీనివాస్‌గౌడ్, బం డారి శ్రీనివాస్‌గౌడ్, తానిపర్తి మోహన్‌రావు, మర్కు లక్ష్మణ్, ఐరెడ్డి వెంకట్‌రెడ్డి, గజవెల్లి పురుషోత్తం, ఎడ్ల మల్లేశం, కవ్వంపల్లి దుర్గయ్య, పర్శరాములుగౌడ్, అంజయ్య పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...