విద్యార్థుల రక్తదానం


Fri,August 23, 2019 01:22 AM

సుల్తానాబాద్‌: శాతవాహన యూనివర్శిటీ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో నిర్వహించిన జీవిత మెళుకువలు, వ్యక్తిత్వ వికాస అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీవాణీ విద్యార్థులు రక్తదానం చేసినట్లు విద్యాసంస్థల అధినేత రేకులపల్లి విజయ్‌కుమార్‌ తెలిపారు. డిగ్రీ, పీజీ కళాశాల నుంచి ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు 10 మంది పాల్గొన్నారనీ, అందులో శివకుమార్‌, నాగేందర్‌ అనే వి ద్యార్థులు రక్తదానం చేశారని తెలిపారు. ఈ సందర్భంగా వారిని అభినందించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాళ్లు బండారి కమలాకర్‌, పూరెళ్ల సదానందం, వైస్‌ప్రిన్సిపాళ్లు బాలు, కుమార్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ కో-ఆర్డినేటర్‌ ఆర్‌ జయప్రతాప్‌, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...