కేసీఆర్‌తోనే అందరికీ అభివృద్ధి ఫలాలు


Fri,August 23, 2019 01:22 AM

జూలపల్లి: సీఎం కేసీఆర్‌ పాలనలోనే ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు చేరువవుతున్నాయని జూలపల్లి జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్‌ పేర్కొన్నారు. మండలంలోని వెంకట్రావ్‌పల్లిలో రూ.1.75 లక్షల ఈజీఎస్‌ నిధులతో నిర్మించిన సామాజిక మరుగుదొడ్లను గురువారం రఘువీర్‌సింగ్‌తో కలిసి ప్రారంభించారు. అలాగే తెలంగాణకు హరితహారం ఐదో విడతలో భాగంగా కొబ్బరిమొక్కలు నాటారు. అనంతరం గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు శాలువాలు కప్పి సన్మానించారు. వారికి జ్ఞాపికలు అందజేసి అభినందించారు. మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు తప్పకుండా వినియోగించుకోవాలని పేర్కొన్నారు.

ఇక్కడ సర్పంచ్‌ రేశవేని రాధ, ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, ఎంపీటీసీ దండె వెంకటేశం, ఉపసర్పంచ్‌ జుట్టు విజయ, మండల ప్రత్యేకాధికారి సుధాకర్‌, ఏఈ సుమలత, పంచాయతీ కార్యదర్శి శరత్‌, నాయకులు రేశవేని శ్రీనివాస్‌, మల్లెత్తుల సాగర్‌, కటికిరెడ్డి నర్సయ్య, పుట్ట గంగయ్య, మల్లెత్తుల భూమయ్య, పసునూటి రవి, వేల్పుల సందీప్‌, పర్లపల్లి రవి, దుగ్యాల మనోహర్‌రావు, పోల్సాని శ్రీనివాస్‌రావు, కూసుకుంట్ల రాంగోపాల్‌రెడ్డి, ఒల్లె తిరుపతి, దుగ్యాల వెంకట్రావ్‌, నేరేడుగొమ్మ సాగర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...