మొక్కల సంరక్షణ అందరి బాధ్యత


Fri,August 23, 2019 01:21 AM


ధర్మారం: మొక్కల సంరక్షణ అందరి బాధ్యతని పెద్దపల్లి ఎక్సైజ్‌ ఎస్‌ఐ మనీషా రాథోడ్‌ అన్నారు. గురువారం మండలంలోని కమ్మర్‌ఖాన్‌పేట గ్రామ శివారులో ఎస్‌ఐ మనీషా రాథోడ్‌ ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా గ్రా మ ప్రజాప్రతినిధులు, గీత కార్మికులు, వివిధ శాఖల సిబ్బంది కలిసి వెయ్యి ఈత మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాటాడారు. కార్యక్రమంలో గ్రామసర్పంచ్‌ గుజ్జుల రమ, ఎంపీటీసీ కాదాసి శంకరమ్మ, మాజీ ఉప సర్పంచ్‌ గుజ్జుల వేణుగోపాల్‌రెడ్డి, ఎక్సైజ్‌ శాఖ హెడ్‌ కానిస్టేబుళ్లు, సిబ్బంది బీ రవీందర్‌, ఎస్‌ శరత్‌, ఏ కిరణ్‌, వీ రజిత, రాజేందర్‌, వీఆర్‌ఓ, వీఆర్‌ఏ, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.


కాల్వశ్రీరాంపూర్‌: యువత సామాజిక కార్యక్రమాల్లో ముందుండాలని తాసిల్దార్‌ డిండిగాల రవీందర్‌ పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఇద్లాపూర్‌ గ్రా మ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్‌ దొంతరవేన రజిత, ఛత్రపతి యువసేన యూత్‌ సభ్యులతో కలిసి గురువారం మొక్కలు నాటారు. అనంతరం పంచాయతీ పాలకవర్గంతోపాటు, ఛత్రపతి యువసేన యూత్‌ సభ్యులు తాసిల్దార్‌ రవీందర్‌కు పూలమొక్క అందజేసి, శాలువాతో సత్కరించారు. ఉపసర్పంచ్‌ గొర్ల తిరుమల, గిర్దావర్‌ ధనలక్ష్మి, పట్వారీ రాజు, వార్డు సభ్యురాలు వందన, పంచాయతీ కార్యదర్శి, టీఆర్‌ఎస్‌ నాయకులు దొంతరవేన తిరుపతి, గొర్ల దేవేందర్‌, యూత్‌సభ్యులు తోట శ్రీనాథ్‌, రంజిత్‌, ప్రశాంత్‌, మధు, బందారపు రమేశ్‌, పోగుల అనిల్‌, రాజ్‌కుమార్‌, రాజేశ్‌ ఉన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...