ఎయిర్‌పోర్టు నిర్మించాలని ఏఏఐ బృందానికి వినతి


Fri,August 23, 2019 01:21 AM

పాలకుర్తి: రామగుండం పారిశ్రామిక ప్రాం తం లో ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టాలని, రామగుండం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సభ్యులు గురువా రం ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా బృం దం సభ్యులకు వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలిసి చాంబర్‌ ఆ ఫ్‌ కామర్స్‌ సభ్యులు అశోక్‌రావు, రమణారెడ్డి, చంద్రమౌళి, రాజేశ్వర్‌రావు, భిక్షపతి, సారయ్య శివశంకర్‌లు ఏఏఐ సభ్యులను కలిశారు. రామగుండం, మంచిర్యాల ప్రాంతానికి చెందిన వేలాదిమంది వ్యాపారులు హైదరాబాద్‌తోపాటు, సూరత్‌, అహ్మదాబాద్‌, కలకత్తా, ఢిల్లీ, ముంబ యి, చెన్నై ప్రాంతాలకు నిత్యం వెళ్తుంటారని, స్థానికంగా ఎయిర్‌పోర్టు అవసరమని వారు పేర్కొన్నారు. తమ వినతిని పరిగణలోకి తీసుకుని ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరా రు. అంతకుముందు వారు ఏఏఐ సభ్యులకు పుష్పగుచ్ఛం ఇచ్చారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...