స్వరాష్ట్రంలోనే కళాకారులకు గౌరవం


Fri,August 23, 2019 01:20 AM

రాంమందిర్‌ ఏరియా: సమైఖ్యపాలనలో తెలంగాణ ప్రాంత కళాకారులు, కవుల పట్ల వివక్ష చూపేవారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ కళాకారులకు అండగా నిలుస్తూ వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించి సముచిత స్థానం కల్పించారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు. గురువారం ఓ ఫంక్షన్‌హాల్‌లో విజయమ్మ ఫౌండేషన్‌, గోదావరి కళాసంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ప్రపంచ జానపద కళల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ, కళాకారులకు జీవం పోసిన గడ్డ రామగుండం పారిశ్రామిక ప్రాంతమని అన్నారు. కళలకు, కళాకారులకు నిలయంగా రామగుండం ప్రాంతం నిలిచిందని తెలిపారు.

ఈ ప్రాంతంలో కళాకారులకు అతి త్వరలోనే ఆడిటోరియం నిర్మించి ఇస్తామన్నారు. కళాకారులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందచేస్తామని, వారికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వా నిదేనని ఉద్ఘాటించారు. అనంతరం పలువురు కళాకారులను సన్మానించారు. కార్యక్రమంలో కనకం రమణయ్య, దయానర్సింగ్‌, తిరుమలేశ్‌, దామెర శంకర్‌, రామన్న, జనగామ నర్సయ్య, మల్లేశ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు అభిషేక్‌రావు, ఆడప శ్రీనివాస్‌, జావీద్‌పాషా, మహేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...