ముదిరాజ్ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ


Thu,August 22, 2019 01:31 AM

పెద్దపల్లిటౌన్: తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని ముదిరాజ్ సంఘం ప్రజాప్రతినిధులకు ఆగస్టు 23న హైదరాబాద్‌లో సన్మానం చేయనున్నట్లు ఆ విభాగం జిల్లా అధ్యక్షుడు బల్ల సత్తయ్య ముదిరాజ్ తెలిపారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణలో బుధవారం తెలంగాణ మహాసభ పోస్టర్‌ను ముదిరాజ్‌లు ఆవిష్కరించారు. ఈ సం దర్భంగా సత్తయ్య మాట్లాడుతూ, కులానికి చెందిన ఎంపీపీలు, జడ్పీ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులకు గౌరవ సూచకంగా హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమంలో సన్మానం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి ఈటల రాజేందర్, రాజ్యసభ్య ఎంపీ బండ ప్రకాశ్ హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు ము త్యాల రాజయ్య, ఎద్దు కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి వేల్ఫుల లక్ష్మీనారాయణ, కుంభం సంతోష్, పరమేశ్వర్, కందుల రాజేందర్, దావళ్ల శ్రీనివాస్, చొప్పరి వెంకటేశ్, కొలిపాక శ్రీధర్ తదితరులున్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...