సమాజంపై ఆసక్తి పెంచుకోవాలి


Thu,August 22, 2019 01:30 AM

రాంమందిర్ ఏరియా: ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు సమాజసేవపై ఆసక్తి, ప్రేమను పెంచుకోవాలని రామగుండం డీసీపీ (లాఅండ్ ఆర్డర్ ) రవి కుమార్, శాతవాహన యూనివర్సిటీ ఎస్‌ఎస్‌ఎస్ విభాగం అధిపతి హరికాంత్ పేర్కొన్నారు. గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లకు కొనసాగుతున్న శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు మంచి క్రమశిక్షణ కలిగి సమాజంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సేవా కార్యక్రమాల్లో ముందుండి మంచి పౌరులుగా ఎదగాలన్నారు. ఈ శిక్షణలో నేర్చుకున్న అంశాలను జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతాని వివరించారు. అనంతరం ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. అంతకు ముందు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మం చిర్యాల వారి ఆధ్వర్యంలో కళాశాలలో ఏర్పాటు చేసిన రక్తదానం శిబిరంలో వాలంటీర్లు, పోగ్రాం అధికారులు పాల్గొని రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయ కర్తలు తన్నీరు హరీశ్, యాట ప్రసాద్, స్వప్న, కనుకయ్య, శంకర్, తాజొద్దీన్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...