సేవ చేయడం అదృష్టంగా భావించాలి


Thu,August 22, 2019 01:30 AM

ఫెర్టిలైజర్‌సిటీ: మలి దశలో ఉన్న వృద్ధులకు సేవ చేసుకోవడం ఒక భాగ్యంగా భావించాలని గోదావరిఖని 2వ అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ పర్వతపు రవి అన్నారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా గోదావరిఖని ధర్మశాస్త్ర నిత్యన్నదాన వేదిక వృద్ధుల ఆశ్రమంలో బుధవారం వృద్ధులకు ఉచితంగా వైద్య శిబిరం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. తల్లిదండ్రులు తమ సుఖ సంతోషాలను త్యాగం చేసి పిల్లలను పెంచి పెద్ద చేశాక వారిని అనాథలుగా విడిచిపెట్టడం బాధాకరమన్నారు. అనంతరం వైద్యులు రాజేంద్రప్రసాద్, శ్రీధర్, సరితా రాథోడ్ వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అం దజేశారు. అనంతరం మెజిస్ట్రేట్ చేతుల మీదుగా వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, న్యాయవాదులు ఎం.కుమారస్వామి, ముస్కె రవికుమార్, నూతి సురేశ్, రాజ్ కుమార్, శ్యాంసుందర్, ఎరుకల ప్రదీప్‌కుమార్‌తోపాటు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...