భూపాలపల్లి డీసీహెచ్‌ఎస్‌గా వాసుదేవరెడ్డి


Thu,August 22, 2019 01:30 AM

కలెక్టరేట్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్య విధాన పరిషత్ సమన్వయకర్తగా పెద్దపల్లికి చెందిన డాక్టర్ మందల వాసుదేవరెడ్డిని ప్రభుత్వ నిర్దేశకాల ప్రకారం నియమిస్తూ వైద్య విధాన పరిషత్ కమిషనర్ మానిక్‌రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం వైద్య విధాన పరిషత్ జాయింట్ కమిషనర్ చేతుల మీదుగా హైదరాబాద్‌లో వాసుదేవరెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా డీసీహెచ్‌ఎస్‌గా నియామక పత్రాలను అందుకున్నారు. ఆయన నియామకంపై పెద్దపల్లికి చెందిన పలువురు వైద్యులు, ఐఎంఏ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...