26న మల్లన్న ఆలయంలో లక్ష బిల్వార్చన


Thu,August 22, 2019 01:29 AM

ఓదెల: జిల్లాలో ప్రసిద్దిగాంచిన పుణ్య క్షేత్రం ఓదెల మల్లికార్జునస్వామి ఆల యంలో ఈ నెల 26వ తేదీన సామూహిక లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి రాజేంద్రం తెలిపారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడారు. శ్రావణ మాసోత్సవమును పురస్కరించుకొని అర్ద్ర నక్షత్రము సందర్భంగా సోమవారం ఉదయం 9 గంటల నుంచి మల్లికార్జునస్వామి వారికి సామూహిక లక్ష బిల్వార్చన పూజా నిర్వహించనున్నట్లు వివరించారు. శ్రావణ మాసం అత్యంత పవిత్రమైనది కావడంతో సకల మానవాళి సంరక్షణార్థమై స్వామి వారికి రోజూ విశేష పూజలు, అభిషేకాలు చేయిస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఈ ప్రత్యేక పూజ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...