గ్రామాల్లో ప్లాస్టిక్ నిషేధానికి శ్రీకారం


Wed,August 21, 2019 03:18 AM

-స్వచ్ఛసర్వేక్షణ్ గ్రామీణ్ కార్యక్రమాలు షురూ
-ప్రత్యేక గ్రామసభల నిర్వహణ
-అవగాహన ర్యాలీలు
-పరిశుభ్రత, ఇంకుడుగుంతల నిర్మాణాలపై సూచనలు
ఓదెల: శానగొండలో ప్లాస్టిక్‌ను పూర్తి స్థాయిలో నిషేధించేందుకు మంగళవారం శ్రీకారం చుట్టా రు. ప్లాస్టిక్‌తో కలిగే అనర్థాలను ప్రజలకు వివరిస్తూ గ్రామంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యు డు జీల తిరుపతి మాట్లాడారు. ప్లాస్టిక్‌తో పర్యావరణం కాలుష్యమవుతుందనీ, పలు రకాల రోగాలు కూడా ప్రబలనున్నట్లు పేర్కొన్నారు. శానగొండను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దే కార్యక్రమానికి అందరూ సహకరించాలని కోరారు. అనంతరం తోపుడుబండ్లతో గ్రామంలో తిరుగుతూ ప్లాస్టిక్‌ను సేకరించారు. కార్యక్రమంలో సర్పంచ్ గుంటి సునీత, మాజీ సర్పంచ్ బొమ్మ చంద్రయ్యగౌడ్, కార్యదర్శి ముస్తాఫా, ఏఎన్‌ఎం ఫర్వీనా, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులున్నారు.

కాల్వశ్రీరాంపూర్ : మండలంలోని అన్ని గ్రామాలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిది ద్దాలని ఎంపీపీ నూనేటి సంపత్, తాసిల్దార్ డిండిగాల రవీందర్ కోరారు. ఎస్‌ఎస్‌జీ-19లో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో మంగళవారం గ్రామ సభలు నిర్వహించారు. కాల్వశ్రీరాంపూర్‌లో తాసిల్దార్, మంగపేటలో ఎంపీపీ వేర్వేరుగా హాజరై మాట్లాడారు. హరిత హారంలో ప్రతి ఇంటికి ఐదు మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో నాయబ్ తాసిల్దార్ సుమన్, వైస్ ఎంపీపీ జూకంటి శిరీష, కోఆప్షన్ సభ్యుడు ఎండీ ఇబ్రహీం, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఉప సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

జూలపల్లి : ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి కోరారు. కోనరావుపేటలో మంగళవారం ఎంపీపీ ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు కలిసి వీధుల్లో చెత్తా చెదారం తొలగించి అవగాహన కల్పించారు. ఇక్కడ సర్పంచ్ కూసుకుంట్ల మంగ, ఉప సర్పంచ్ కత్తెర్ల వజ్రమ్మ, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అలాగే మండల వ్యాప్తంగా గ్రామపంచాయతీల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్లాస్టిక్ నిర్మూలన ఆవశ్యకతపై ప్రజలకు వివరించారు. ప్లాస్టిక్ వస్తువులు నిర్మూలించాలని కోరుతూ పలు గ్రామాల్లో పంచాయతీ పాలక వర్గ సభ్యులు, గ్రామస్తులు తీర్మాణం చేశారు. ఇక్కడ మండల సర్పంచులు ఫోరం అధ్యక్షుడు దారబోయిన నరసింహం, ఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొప్పుల మహేశ్, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఎలిగేడు(జూలపల్లి) : ప్లాస్టిక్ సంచులు, వస్తువులు నిర్మూలించాలని కోరుతూ ఎలిగేడు మండలంలోని గ్రామ పంచాయతీ పాలక వర్గ సభ్యులు, గ్రామస్తులు తీర్మాణాలు చేశారు. ఆయా గ్రామా ల్లో మంగళవారం ప్రత్యేక గ్రామ సభలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎంపీపీ తానిపర్తి స్రవంతి, వైస్ ఎంపీపీ బుర్ర వీరస్వామి, జడ్పీ సభ్యురాలు మండిగ రేణుక, సర్పంచులు బూర్ల సింధుజ, మాడ కొండల్‌రెడ్డి, పెద్దోల్ల ఐలయ్య, ఎంపీటీసీ సభ్యులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ధర్మారం : కటికెనపల్లిలో డ్రైనేజీల పూడ్చి వేతలు కొనసాగుతుండగా, కొత్తపల్లి (న్యూ)లో ప్లాస్టిక్ వినియోగంతో కలిగే నష్టాలపై గ్రామ పంచాయతీ వారు ప్రజలకు అవగాహన కల్పించారు. సర్పంచ్ కారుపాకల రాజయ్య ఆధ్వర్యం లో కటికెనపల్లిలో మంగళవారం మట్టితో డ్రేనేజీల పూడ్చి వేత కొనసాగింది. పలు రోడ్లపై కంకర చూర పోయించి మరమ్మతు చేయించారు. అలాగే కొత్తపల్లి (న్యూ)లో ప్రత్యేక గ్రామ సభను నిర్వహించి ప్లాస్టిక్ వాడవద్దని సర్పంచ్ దార మల్లమ్మ, ఎంపీటీసీ సభ్యుడు సూరమల్ల శ్రీనివాస్, గ్రామ సెక్రెటరీ సంపత్, ఉప సర్పంచ్ రమేశ్, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో తీర్మానించారు. అనంతరం ప్రజలకు ఎస్‌ఎస్‌జీ యాప్‌ద్వారా అభిప్రాయానలు తెలుపాలని అవగాహన కల్పించా రు. గ్రామ సమీపాన ఉన్న చెరువు కట్టపై ముదిరాజ్ కులస్తులు శ్రమదానంతో శుభ్రం చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలను డంపింగ్ యార్డుకు తరలించారు. కటికెపల్లి గ్రామంలో కూడా ప్లాస్టిక్ నిషేధంపై సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామసభను నిర్వహించారు. అలాగే ధర్మారంలో ప్లాస్టిక్ రహితంగా ఉంచాలని గ్రామ సభ తీర్మాణించింది. గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ప్రత్యేక గ్రామ సభను సర్పంచ్ పూస్కూరు జితేందర్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజలు, అన్ని దుకాణాల్లో ప్టాస్టిక్ కవర్లు, గ్లాసులు వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని సర్పంచ్ కోరారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులతో కలిసి ప్లాస్టిక్ ను వినియోగించ వద్దని అవగాహన ర్యాలీని తీశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ -1 తుమ్మల రాంబాబు, మండల కోఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, ఈఓపీఆర్డీ శంకరయ్య, సెర్ప్ ఏపీఎం కనకయ్య, పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్ తదితరులున్నారు.
సుల్తానాబాద్‌రూరల్: మండలంలోని దుబ్బపల్లి, కందునూరిపల్లి, దేవునిపల్లితో పాటు పలు గ్రామాల్లో మంగళవారం గ్రామసభలను నిర్వహించారు. ఈ సంద ర్భంగా పరిసరాల పరిశుభ్రతతో పాటు తదితర విషయాలను చర్చించారు. కార్యక్రమంలో సర్పంచులు శ్రావణ్ కుమార్, పనాల స్వరూప, కోమలత తదితరులు ఉన్నారు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...