మహిళా సాధికారిక కమిటీ ఏర్పాటు


Wed,August 21, 2019 03:16 AM

గోదావరిఖని,నమస్తే తెలంగాణ : రామగుండం కార్పొరేషన్ పరిధిలో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిం చే లక్ష్యంతో మహిళా సాధికారిక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మ హిళా సాధికారిక కమిటీ కన్వీనర్‌గా తాను ఉంటానని, సభ్యులుగా అనుముల కళావతి, కల్వచర్ల క్రిష్ణవేణి, బద్రి రజిత, శ్రీపెల్లి ఇందు, లవిన వ్యవహరిస్తారని ఆయన ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా ముందుకు సాగాలనీ, ఉపాధి అవకాశాలు కల్పించుకోవడానికి వివిధ వృత్తి విద్యా కోర్సులను నేర్చుకోవాలన్నారు. విజయమ్మ పౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ సెంటర్లను వివిధ డివిజన్లలో ఏర్పాటు చేస్తామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. సాధికారిక కమిటీ సభ్యులు కుట్టుమిషన్ సెంటర్ల పనితీరును పర్యవేక్షిస్తారని ఎమ్మెల్యే చందర్ వివరించారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...