ప్రజారోగ్యమే ప్రథమ లక్ష్యం


Wed,August 21, 2019 03:16 AM

గోదావరిఖని టౌన్: ప్రజారోగ్యమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయ ఆడిటోరియంలో పరిశ్రమల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పర్యావరణ సమతుల్యత కాపాడాలంటే మొక్కలు విరివిగా పెంచాలన్నారు. రామగుండం ప్రాంతంలో ఎన్టీపీసీ, జెన్‌కో, సింగరేణి అధికారులతో వాతావరణ కాలుష్య నివారణ కోసం జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. దేశంలోని వాతావరణ కాలుష్యంలో రామగుండం ప్రాంతం సైతం ఉన్నత స్థానంలో ఉన్నట్లు ఇటీవల పలు సంస్థలు ప్రకటించాయని, రాబోయే రోజుల్లో కాలుష్య నివారణకు పాటుపడాలని అన్నారు. వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం చేపట్టిందనీ, సింగరేణి, జెన్‌కో, ఎన్టీపీసీ సంస్థలు బాధ్యతగా తీసుకొని మొక్కల పెంపకంపై దృష్టి సారించాలని సూచించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హరితహారాన్ని పకడ్బందీగా చేపడుతున్నామనీ, ఐదులక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నామనీ, 10 మొక్కలు నాటి 2 సంవత్సరాలపాటు సంరక్షణ చేస్తే వారికి రూ.750లు అందిస్తున్నామన్నారు. ఇక్కడి పరిశ్రమలు వాతావరణ సమతుల్యతను కాపాడే బాధ్యతను స్వీకరించాలన్నారు. సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, సింగరేణి జీఎం విజయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...