భూ సమస్యల పరిష్కారానికే పల్లెబాట


Wed,August 21, 2019 03:16 AM

రామగిరి: భూ సమస్యల పరిష్కారానికి పల్లెబాట కార్యక్రమం నిర్వహిస్తున్నామని రామగిరి తాసిల్దార్ భూహేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం రెవెన్యూ పల్లెబాటలో భాగంగా కల్వచర్ల, సుందిళ్ల గ్రామాల్లో రెవెన్యూ సభలు నిర్వహించి రైతులకు సంబంధించిన భూరికార్డుల్లోని సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అర్హులందరికీ పట్టా పాసుపుస్తకాలు పంపిణీ చేస్తామని, ఇంకారాని వారు, ఆన్‌లైన్‌లో తమ భూమి వివరాలు నమోదు కాని వారు గ్రామసభల్లో తమ దృష్టికి తీసుకువస్తే పరిశీలించి వెంటనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ఇందుకోసం ఆయా గ్రామాల్లో నిర్ణయించిన తేదీల ప్రకారం తమ రెవెన్యూ అధికారులు ఉదయం 10 నుంచి సాయంత్ర 4 గంటల వరకు అందుబాటు ఉంటారనీ, అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలనీ ఆయన కోరారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమంలో ఆయా గ్రామల సర్పంచులు గంటా పద్మ, దాసరి లక్ష్మి, రెవెన్యూ ఆర్‌ఐ అజయ్, సీనియర్ అసిస్టెంట్ ప్రభావతి, వీఆర్వోలు కరుణాకర్, శ్రీనివాస్, ఎంపీటీసీ కొట్టె సందీప్, ఉపసర్పంచ్‌లు గర్రెపల్లి సదానందం, బండ ప్రసాద్, నాయకులు గంటా వెంకటరమణరెడ్డి, దాసరి రాయలింగు పాల్గొన్నారు.

కమాన్‌పూర్: రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కమాన్‌పూర్ డిప్యూటీ తాసిల్దార్ వినయ్‌కుమార్ అన్నారు. మండలంలోని గుండారం గ్రామంలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. రైతుల భూ సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. నాగారంలో కూడా రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుల్లో రైతుల నుంచి ఆర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో ఎంపీపీ రాచకొండ లక్ష్మి, ఎంపీడీవో వెంకటేష్‌జాదవ్, సర్పంచులు ఆకుల ఓదెలు, ఇటవేన కొమురమ్మ, కో ఆప్షన్ సభ్యుడు ఇంతియాజ్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...