తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవు


Wed,July 24, 2019 04:22 AM

జూలపల్లి : పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి ఘాటుగా వంట నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఆకస్మికంగా మధ్యాహ్న భోజన వంట నిర్వాహణ తీరును తనిఖీ చేశారు. మెనూ సక్రమంగా ఎందుకు పాటించరని ధ్వజమెత్తారు. నీళ్ల చారు, బియ్యంలో రాళ్లు వేరకుండా నిర్లక్ష్యం గా వంట చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులు తన దృష్టికి తీసుకువస్తున్నారనీ, ఎవరిపై వ్యక్తిగతంగా ద్యేషం లేదని పేర్కొన్నారు. విద్యార్థులకు మంచి ఆహారం అందించాలనీ, వంట నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. వారి వెంట కాచాపూర్ ఎంపీటీసీ సభ్యురాలు మారుపాక శ్రీలత, హెచ్‌ఎంలు ప్రభాకర్, ప్రదీప్‌రెడ్డి, నాయకులు ప్రదీప్, మారుపాక కుమార్ తదితరులున్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...