మంత్రి ఆదేశంతో సర్వే ప్రక్రియ షురూ


Wed,July 24, 2019 04:21 AM

ధర్మారం: రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు ఎస్సారెస్పీ డి -83 ప్రధాన కాల్వకు కొత్త తూము ఏర్పాటు కోసం ఆ శాఖ అధికారులు సర్వే ప్రక్రియను ప్రారంభించారు. జూలపల్లి మండలం కుమ్మరికుంట నుంచి డి-83 ప్రధాన కాల్వ నుంచి ధర్మారం, వెల్గటూరు మండలాలకు 11ఎల్ డి-83 బ్రాంచి కాల్వకు సరిపోయే నీరు సరఫరా కావడం లేదని అందుకు ప్రత్నామ్నాయ తూమును ఏర్పాటు చేయించాలని ఇది వరకు టీఆర్‌ఎస్ నాయ కులు, ఆ ప్రాంత ప్రజా ప్రతినిధులు రాష్ట్ర సంక్షేమ మంత్రికి సమస్యను విన్నవించారు. తాజాగా ఇదే సమస్యపై సోమవారం ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ ఆధ్వర్యంలో జడ్పీ సభ్యురాలు పూస్కూరు పద్మజ, టీఆర్‌ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు గుర్రం మోహన్‌రెడ్డితో పాటు పలు గ్రామాల సర్పంచులు పెద్దపల్లిలో ఎస్సారెస్పీ ఈఈని కలిసి విన్నవించారు. దీంతో స్పందించిన మంత్రి 11 ఎల్ డి-83 కాల్వకు నీటి సరఫరా అవాంతరాలు శాశ్వతంగా తొలగించేందుకు కొత్త తూము ఏర్పాటు చేసేందుకు సర్వే చేసి అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు.

స్థల పరిశీలన
మంత్రి ఆదేశంతో ఎస్సారెస్పీ ఈఈ స్పందించి సర్వే కోసం మంగళవారం ఆ శాఖ ఏఈలు రవికాంత్, రవీందర్‌రావును పంపించారు. దీంతో వారు ఇక్కడి సర్పంచులు, ఎంపీటీసీలతో కలిసి కుమ్మరికుంట శివారులోని డి-83 ప్రధాన కాల్వకు కొత్తగా తూము ఏర్పాటు స్థలాన్ని పరిశీలించారు. ఇట్టి తూము నుంచి అనుసంధానం చేయి నీటి సరఫరా జరిగే ధర్మారం మండలం దొంగతుర్తి శివారులోని 11ఎల్ డి -83 1ఆర్ కాల్వను పరిశీలిం చారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న తూము నుంచి 1ఆర్ కాల్వకు ఉన్న దూరం ఎంత అనే విషయాలపై సదరు ఏఈలు ప్రాథమిక అంచనా వేశారు. అనంతరం సంబంధిత అధికారులకు నివేదిస్తామని ఏఈలు చెప్పినట్లు ఆయా గ్రామాల నాయకులు తెలిపారు. కొత్త తూముతో సుమారు 2,500 ఎకరాలకు సాగు నీటి ఇబ్బందులు తొలగిపోతాయని నాయకులు ఏఈలకు వివరించారు.

కార్యక్రమంలో దొంగతుర్తి, రామయ్యపల్లి సర్పంచులు పాలకుర్తి సత్తయ్య, రేగుల సదన్‌బాబు, ఎంపీటీసీ సభ్యుడు దాడి సదయ్య, దొంగతుర్తి ఉప సర్పంచ్ ముత్యాల చంద్రశేఖర్,ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా సభ్యుడు పాకాల రాజయ్య, మాజీ సర్పంచ్ జుంజిపల్లి రమేశ్, టీఆర్‌ఎస్ నాయకులు మోతె కనకయ్య, బెల్లాల లక్ష్మణ ప్రసాద్, కీసరి స్వామి, దేవి వీరేశం, దొనికెని తిరుపతి, కోల వెంకటేశం, మద్దునాల వెంకటేశం,కోట మహేందర్, వేల్పుల కుమార్, నర్ర రాజు, వెంగళి శ్యాం, గర్షకుర్తి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...