ముగ్గురు నిందిఫారెస్టు అధికారుల పై దాడిలో


Wed,July 24, 2019 04:18 AM

మంథని, నమస్తే తెలంగాణ : మహాముత్తారం మండలం పొలంపల్లి రిజర్వు ఫారెస్టులో 2012 లో ఫారెస్టు అధికారులపై దాడి, హత్యాయత్నంకు ప్రయత్నించిన ముగ్గురు నింధుతులకు ఐదేండ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికీ రూ. 1000 చొప్పున జరిమాన విధిస్తూ మంథని అసిస్టెంట్ షేషన్స్ కోర్టు జడ్జీ మహమ్మద్ అబ్దుల్ జావిద్ పాషా మంగళవారం తీర్పును ఇచ్చారు. పొలంపల్లి అడవిలో ఎడ్ల బండ్ల ద్వారా కలప రవాణా చేస్తున్న చిట్యాల మండలం కల్వపల్లికి చెందిన సూర తిరుపతి, సూర రాజు, మహాముత్తారానికి చెందిన సీపతి సత్యంలను అడ్డుకోబోయిన ఫారెస్టు అధికారులు సత్యనారాయణ, లక్ష్మీ ప్రసాద్‌లపై దాడి, హత్యాయత్నానికి పాల్పడ్డారు.

ఈ మేరకు వారు మహాముత్తారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, అప్పటి ఎస్‌ఐ రాజ్‌కుమార్ కేసు నమోదు చేసి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. కోర్టులో కేసు విచారణ కొనసాగింది. తుది విచారణలో మహాముత్తారం పోలీస్ స్టేషణ్ కోర్టు కానిస్టేబుల్ సదాశివరెడ్డి సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా, పీపీ వెంకట్రాం రెడ్డి విచారించారు. విచారణ అనంతరం జడ్జ్ మహమ్మద్ అబ్దుల్ జావిద్ పాషా నిందితులకు ఐదేండ్లు జైలు రూ. 1000 జరిమాణ విధిస్తూ తీర్పు ఇచ్చారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...