పని చేసే వారికే గుర్తింపు..


Mon,July 15, 2019 02:40 AM

-ప్రతి గ్రామంలో 90 శాతం సభ్యత్వాలుండాలి
- ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
-కార్యకర్తలు నిబద్ధతతో పని చేయాలి
-పార్టీ ఆదేశాలను శిరసావహించాలి
-పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌
-జిల్లా కేంద్రంలో ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం
కలెక్టరేట్‌ : పార్టీలో పనిచేసే వారికి తగిన గుర్తిం పు ఉంటుందనీ, ప్రతి కార్యకర్త బాధ్యతగా వ్యవహరిస్తూ సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని అధిగమించాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ట్రినిటీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం ఏర్పాటు చేసిన ము ఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ గుప్తాతో కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో చేపట్టిన సభ్యత్వ నమోదు కంటే అధికంగా పెద్దపల్లి నియోజకవర్గంలో సభ్యత్వాలు చేసి, జిల్లాలోనే మొదటి స్థానంలో నిలపాలని కోరారు. సభ్యత్వ నమోదు లో నాయకులు, కార్యకర్తలు పనితీరును కొలమానంగా చేసుకుని, భవిష్యత్తులో అవకాశాలను కల్పిస్తామన్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 16వేల పైచిలుకు సభ్యత్వాలు నమోదయ్యాయ నీ, మరో రెండు రోజుల్లోగా లక్ష పూర్తి చేసి పుస్తకాలను అప్పగించాలన్నారు. ప్రతి గ్రామంలోనూ 90 శాతం దాకా సభ్యత్వాలుండాలని కోరారు. ప్రభుత్వం ప్రతి ఇంటికీ ఆమోదయోగ్యమైన సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నదనీ, వాటి ని గడపగడపకూ తెలియజేస్తూ సభ్యత్వ నమోదులో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలని సూచించారు.

నిబద్ధతతో పనిచేయాలి..
పార్టీలోని ప్రతి కార్యకర్త నిబద్ధతతో పని చేయాలని పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి కోలేటి దామోదర్‌ గుప్తా సూచించారు. సీఎం కేసీఆర్‌ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నదనీ, దేశంలోనే తెలంగాణకు ప్రత్యేకత తీసుకొచ్చారని తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు, ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టును నిర్మించి ప్రజల తాగు, సాగు నీటి కష్టాలను దూరం చేశారని కొనియాడారు. అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా పథకాలను అమలు చేస్తున్నారనీ, దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టిన దాఖలాలు లేవన్నారు. ప్రతి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని నిర్మించి, పార్టీ కార్యకలాపాలను ప్రజలకు మరింత చేరువలోకి తెచ్చేలా సీఎం కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రణాళికలు రూపొందించాని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు పండుగలా సాగుతున్నదని చెప్పారు. అభివృద్ధిలో గుజరాత్‌ను మరిపించేలా తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్‌ తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. పార్టీలో మహిళలను భాగస్వాములను చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జీ రఘువీర్‌సింగ్‌, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు కోట రాంరెడ్డి, ఎంపీపీలు బాలాజీరావు, తానిపర్తి శ్రవంతి, కూసుకుంట్ల రమాదేవి, నూనేటి సంపత్‌ యాదవ్‌, జడ్పీటీసీలు వంగళ తిరుపతిరెడ్డి, బండారి రామ్మూర్తి, నాయకులు అమ్రేశ్‌, గజవెల్లి పురుషోత్తం, గుర్రాల మల్లేశం, పల్లె రాములుగౌడ్‌, మీస అర్జున్‌రావు, నూనేటి కుమార్‌ యాదవ్‌, డాక్టర్‌ అయిల రమేశ్‌, బుర్ర శ్రీనివాస్‌గౌడ్‌, మర్కు లక్ష్మణ్‌, బండారి శ్రీనివాస్‌గౌడ్‌, సాయిరి మహేందర్‌, కొట్టె రవీందర్‌, గజభీంకార్‌ జగన్‌, ఆకుల మహేందర్‌, పాల రామారావు, మ్యాడగోని శ్రీకాంత్‌గౌడ్‌, వంశీ పాల్గొన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...