ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరి ఆత్మహత్య


Mon,July 15, 2019 02:39 AM

కమాన్‌పూర్‌: అప్పుల బాధతో కమాన్‌పూర్‌ మండ లం రొంపికుంట గ్రా మానికి చెందిన ఊరడి సంజీవ్‌ (31) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. రొంపికుంట గ్రామానికి చెందిన ఊరడి సంజీవ్‌ అనే వ్యక్తి అప్పుల బాధ తాళలేక శనివారం రాత్రి 7గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. ఆ కొద్దిసేపటికే గమనించిన కుటుంబసభ్యు లు ఫ్యాన్‌కు ఉన్న తాడును తొలగించి కొన ఊపిరితో ఉన్నట్లు గ్రహించి చికిత్స నిమిత్తం పెద్దపల్లి దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఇదిలా ఉండగా నిరుపేద కుటుంబానికి చెందిన సంజీవ్‌ తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ భార్యా పిల్లలతో జీవనం సాగిస్తున్నప్పటికీ గతం లో కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పుల భారం పెరిగిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడటం గ్రామస్తులను కలిచివేసింది. సంజీవ్‌కు భార్య రజితతో పాటు ఇద్దరు కూతుళ్లు సంకీర్తన, సహారికలు ఉన్నారు. అతడి భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అనవేన మల్లేశం తెలిపారు. సంజీవ్‌ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుని న్యాయం జరిగేలా చూడాలని గ్రామస్తులు కోరారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...