ప్రజల కోసమే నేను


Sun,July 14, 2019 01:33 AM

యైటింక్లయిన్ కాలనీ : తన ఐదేళ్ల పదవీకాలం పూర్తయ్యే వరకూ ప్రజల మధ్యే ఉంటాననీ, వారి సంక్షేమం, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప ని చేస్తానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. శనివారం ఆయన చేపట్టి న ప్రజాహిత యాత్రలో పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత ముఖ్య అతిథిగా పాల్గొన్నా రు. ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి కార్పొరేషన్ ప రిధిలోని 39, 42, 43వ డివిజన్‌లో పర్యటంచా రు. రెడ్డికాలనీలో కోరుకంటి విజయమ్మ చారిటుబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బస్ షెల్టర్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. 39వ డివిజన్ పరిధిలోని న్యూమారేడుపాక, గోపాల్‌నగర్, 43వ డివిజన్‌లోని హనుమాన్‌నగర్, 42వ డివిజన్‌లోని సంతోష్‌నగర్‌లో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ లైన్ పరిస్థితులను పరిశీలించారు. న్యూమారేడుపాకలో మరుగుదొడ్ల సమస్యతోపాటు విద్యుత్ సమస్యను పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు.

గోపాల్‌నగర్, హనుమాన్‌నగర్, సంతోష్‌నగర్‌లో ప్రధాన రోడ్డు, అంతర్గత డ్రైనేజీ అసంపూర్తిగా ఉండడంపై మున్సిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం సరికాదనీ, వెంటనే పనులు పూర్తి చేసి ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని ఎంపీ, ఎమ్మెల్యే సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కలలుగంటున్న బంగారు తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాము లు కావాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో వంద శాతం అభివృద్ధి పనులు పూర్తి చేసి, ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీనివాస్‌రావు, టీఆర్‌ఎస్ నాయకులు దుర్గం రాజేశం, సాగంటి శంకర్, కోండ్ర స్టాలీన్‌గౌడ్, పాలిత్య రవినాయక్, జక్కుల దామోదర్‌రావు, కొమ్ము గట్టయ్య, రమేష్‌రెడ్డి, పోగుల వీరారెడ్డి, ఎరవెల్లి గోపాల్‌రావు, మేడి స దానందం, ముస్కే శ్రీను, పులి రాకేష్, కండెసాగర్, గూడెల్లి చందర్,కుమార్‌నాయక్, సారయ్య నాయక్ తదితరులు ఉన్నారు.

21వ డివిజన్‌లో పర్యటన..
గోదావరిఖని, నమస్తే తెలంగాణ : 21వ డివిజన్‌లో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రజాహిత యాత్ర చేపట్టారు. ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్పొరేషన్‌ను సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని తెలిపారు. నగరాభివృద్ధికి ఏటా రూ.100 కోట్ల నిధులు మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. నాయకుడిగా కాకుండా ప్రజా సేవకుడిగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ శ్రీనివాస్ రావు, నాయకులు మేకల సమ్మయ్య, రత్నాకర్ తదితరులు ఉన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...