పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతా


Sun,July 14, 2019 01:32 AM

గోదావరిఖని,నమస్తే తెలంగాణ: రామగుండం పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని, అందుకు పక్కా ప్రణాళికతో ఉందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఉద్ఘాటించారు. అలాగే సమస్య ఏదైనా నేరుగా క్యాంపు ఆఫీస్‌కు వచ్చి కలువాలని, తాను అందుబాటులో ఉన్నా, లేకున్నా మీ సమస్యలను క్యాంపు ఆఫీస్ సిబ్బందికి అందజేయాలని సూచించారు. ఈ మేరకు స్థానిక క్యాంపు కార్యాలయంలో శనివారం మీ కోసం- మీ ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించి ఫోన్ ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్ష మేరకే పాలన సాగిస్తామనీ, ఎవరికీ ఏ కష్టం రాకుండా చూసుకుంటానని పేర్కొన్నారు. రామగుండంలో ప్రధానంగా గృహాల సమస్యలు అధికంగా ఉన్నాయనీ, ప్రభుత్వంతో మాట్లాడి నియోజకవర్గానికి అనుకున్న దాని కన్నా అదనంగా డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయిస్తానని తెలిపారు. నిరుద్యోగ సమస్య కూడా అధికంగా ఉందనీ, అంతర్గాంలో 102 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేసి దాదాపు 5వేల మందికి ఉద్యోగాలు అందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. తన హయాంలో మహిళలకు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు కృషి చేస్తానన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...