పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం


Wed,July 10, 2019 02:36 AM

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: కరీంనగర్ పట్టణా న్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎమ్మె ల్యే గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. మంగళవారం మానేరుపై సాగుతున్న కేబుల్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్‌లో ఓవైపు ఐటీ టవర్, మరోవైపు కేబుల్ బ్రిడ్జి పనులతో పాటు కేసీఆర్ ఐలాండ్ పనులను కూడా చేపడుతున్నామన్నా రు. వీటితో పాటు మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఇవన్ని పూ ర్తయితే నగరం కొత్త రూపు సంతరించుకుంటుందన్నారు. కేబుల్ బ్రిడ్జి పనుల్లో ఇప్పటికే ఓవైపు కేబుల్ స్తంభం పూర్తయిందని, మరోవైపు పనులు కూడా వేగంగా సాగుతున్నాయన్నారు. ఇదే వేగంతోవచ్చే జనవరి నాటికి ఈ బ్రిడ్జి పనులను పూర్తి చేస్తామన్నారు. దక్షిణ భారతదేశంలోనే అత్యంత పొడవున్న కేబుల్ బ్రిడ్జిగా ప్రసిద్ధిగాంచనున్నదని పేర్కొన్నారు. ఇప్పటికే విదేశాల నుంచి కేబుల్స్ కూడా వచ్చాయని చెప్పారు. దీంతో పాటుగా క మాన్ నుంచి మానేరు నది వరకు, సదాశివపల్లి వైపు కూడా రోడ్డు పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. కార్యక్రమం లో డిప్యూటీ మాజీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, మాజీ కార్పొరేటర్ సునీల్‌రావు, శ్రీకాంత్, వేణు, నాయకులు చల్ల హరిశంకర్, ఎడ్ల అశోక్ తదిత రులు పాల్గొన్నారు.

ఆడబిడ్డలకు సర్కారు అండ..
రాష్ట్రంలోని ఆడబిడ్డలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం 9 వ డివిజన్‌లోని అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన సాముహిక సీమంతాల కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణులకు ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్ఠికాహారం అందిస్తుందన్నారు. అలాగే ప్రవసాలకు రూ. 12 వేలను కూడ అందిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు గసికంటి అరుణ్, హేమలత, మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...