పార్టీలో కార్యకర్తలే కీలకం


Wed,July 10, 2019 02:34 AM

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ : పార్టీని క్షేత్రస్థాయిలో ముందుకు నడిపించడంలో కార్యకర్తల పాత్ర కీలకమని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం నగరంలోని 12, 21, 29వ డివిజన్లలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నామని చెప్పారు. పార్టీ కోసం కష్టపడ్డ వారిని అధిష్ఠానం తప్పక గుర్తిస్తుందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో దేశంలోని అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణ అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తున్నదని తెలిపారు. పార్టీలో సభ్యత్వం తీసుకునేందుకు యువత ఉత్సాహం చూపించడం ఆనందంగా ఉందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో యువత, మహిళల్లో పార్టీకి ఆదరణ పెరుగుతున్నదని చెప్పారు. కార్యకర్తలు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరేలా కృషి చేయాలన్నారు. పెద్ద సంఖ్యలో సభ్యత్వాలు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ రమేశ్, మాజీ కార్పొరేటర్లు వై సునీల్‌రావు, తాటి ప్రభావతి, మనోహర్, ఉమాపతి, వేణు, నాయకులు చల్ల హరిశంకర్, డీ శ్రీధర్, పద్మయ్య, ప్రశాంత్, మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.

వేగంగా పనులు పూర్తి చేయాలి : ఎమ్మెల్యే
నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరంలోని పలు డివిజన్లలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నగరాభివృద్ధి కోసం రూ. 350 కోట్లు నిధులు ఇచ్చారనీ, వాటితో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ వల్ల అభివృద్ధి పనుల్లో ఆలస్యం జరిగిందనీ, వాటిని వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...