ఉద్యమంలా సభ్యత్వ నమోదు


Wed,July 10, 2019 02:33 AM

జమ్మికుంట: సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉద్యమంలా సాగాలనీ, అన్ని వర్గాల ప్రజల నుంచి సభ్యత్వాలను తీసుకోవాలని టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య నాయకులకు పిలుపునిచ్చారు. మంగళవారం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో టీఆర్‌ఎస్ అర్బన్‌శాఖ అధ్యక్షుడు టంగుటూరి రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టగా, అతిథిగా బస్వరాజు సారయ్య హాజరయ్యారు. స్థానిక ప్రజలకు సభ్యత్వ నమోదు రసీదులను అందజేశారు. తర్వాత సారయ్య మాట్లాడుతూ.. సభ్యత్వాలు ఒక పండుగలా సాగుతున్నాయనీ, కార్యక్రమంలో పాల్గొంటున్న నాయకుల, కార్యకర్తల పనితీరు అభినందనీయమని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. జిల్లాలో ఏ పార్టీకి ఒక్క సభ్యత్వం దక్కకుండా చూడాలన్నారు. ప్రజలంతా స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్ సభ్యత్వాలు తీసుకునేందుకు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇంటింటికీ గులాబీ నినాదాలను తీసుకెళ్లాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేయాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని వర్గాల ప్రజలకు పెద్దపీట వేస్తున్నదని పేర్కొన్నారు. నేటి వరకు సభ్యత్వాలు పూర్తి చేయాలనీ, 13 నుంచి కమిటీల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్, నాయకులు చందా రాజు, అశోక్‌రెడ్డి, సదానందం, సాంబయ్య, వీరరాజు, తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌తోనే సమగ్రాభివృద్ధి
హుజూరాబాద్‌టౌన్: టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి సాధ్యమని ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారనీ, అందుకే పార్టీ సభ్యత్వం స్వీకరించడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని పార్టీ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి, మాజీ రాష్ట్ర మంత్రి బస్వరాజు సారయ్య పేర్కొన్నారు. మంగళవారం పురపాలక సంఘం పరిధిలోని పాత 11వ, 10వ వార్డుల్లో మాజీ కౌన్సిలర్లు తాళ్లపెల్లి రజిత, కేసిరెడ్డి లావణ్యల ఆధ్వర్యంలో ఇంటింటా టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. దీనికి ఉమ్మడి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయా వార్డుల్లో ఇంటింటికీ తిరిగి నాయకులతో కలసి సభ్యత్వాలు చేయించారు. ఈ సందర్భంగా బస్వరాజు సారయ్య మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు చెందిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను మళ్లీ గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని 11వ వార్డులో 250 మంది సభ్యులను చేర్పించి రూ.13 వేలు అందజేసిన ఆ వార్డు మాజీ కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్యను సారయ్య అభినందించారు. అనంతరం సారయ్యను, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి, పట్టణ అధ్యక్షులను మాజీ కౌన్సిలర్లు రజిత, లావణ్య దంపతులు శాలువాలు కప్పి, జ్ఞాపికలు ఇచ్చి ఘనంగా సత్కరించారు. పట్టణంలో మంగళవారం 200 క్రియాశీల, 300 సాధారణ సభ్యత్వాలు చేసినట్లు నాయకులు తెలిపారు. అలాగే పురపాలక సంఘం పరిధిలోని దమ్మక్కపేట గ్రామంలో మాజీ వైస్ ఎంపీపీ బావు తిరుపతి, మాజీ సర్పంచ్ కొండాల్‌రెడ్డిల ఆధ్వర్యంలో 150 మంది టీఆర్‌ఎస్ సభ్యత్వాల తీసుకోగా, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, రాష్ట్ర నాయకుడు బండ శ్రీనివాస్‌లు రసీదులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు తాటిపెల్లి రాజన్న, టీఆర్‌ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ ఇసాక్, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు తాళ్లపెల్లి శ్రీనివాస్, మూశం మార్కండేయ, తిరుపతి, వలబోజు తిరుమల్‌చారి, చొల్లేటి శ్యాం, తోట రాజేంద్రప్రసాద్, రంశంకర్‌గౌడ్, మైకెల్, నరేశ్, చందాగాంధీ, రాపర్తి శివ, అన్నయ్యలింగం, కొలిపాక రవి, గోస్కుల చందు, డాక్టర్ కృష్ణమూర్తి, బొల్లి శ్రీను, అశోక్‌రెడ్డి, పత్తి వాసుదేవరెడ్డి, వేముల రాజేశం, వెంకటరమణ, యాళ్ల రేణుక, మొలుగు పూర్ణచందర్, ఏనుగుల గోవర్ధన్, సందీప్, తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...