కాల్వ నర్సయ్యయాదవ్ హఠాన్మరణం


Mon,July 8, 2019 03:24 AM

కరీంనగర్ రూరల్: బొమ్మకల్‌కు చెందిన ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కాల్వ నర్సయ్యయాదవ్ శనివారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతిచెందా డు. ఆయన స్వగ్రామం బొమ్మకల్‌లో అంత్యక్రియలను ఆదివారం నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి హాజరై, నర్సయ్యయాదవ్ పార్థివదేహంపై ఎర్రని వస్త్రం, సీపీఐ పతాకాన్ని కప్పి, లాల్ సలాం చేశారు. అలాగే, నర్సయ్యయాదవ్ అంత్యక్రియల్లో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, మాజీ ఎమ్మెల్యే కొడూరి సత్యనారాయణగౌడ్ పాల్గొని, నివాళి అర్పించారు. చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, కాల్వ నర్సయ్యయాదవ్ 30 ఏళ్లుగా సీపీఐ పార్టీలో పనిచేస్తున్నారనీ, నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న భూసమస్యలు, ఇండ్ల నివేషన స్థలాలు, పింఛన్, కనీస మౌలిక వసతుల కల్పన కోసం ఆయన ఉద్యమాలు చేశారని గుర్తుచేశారు. గొర్రెల, మేకల పెంప కం వృత్తిదారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా పని చేసి, గొర్రెల పెంపకందారుల ఫెడరేషన్ ఏర్పాటుకు కృషి చేశారన్నారు. నర్సయ్య కుటుంబానికి సీపీఐ రాష్ట్ర కమిటీ తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామన్నారు. నర్సయ్యయాదవ్ అంత్యక్రియల్లో జడ్పీటీసీ పురుమల్ల లలిత శ్రీనివాస్, సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్, ఎంపీటీసీ శ్రీనివాస్, ర్యాకం లక్ష్మీమోహన్, సీపీఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, మాజీ మేయర్ డీ శంకర్, కాంగ్రెస్ నాయకుడు మర్రి వెంకటస్వామి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు టీ శ్రీనివాస్‌రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాంగోపాల్‌రెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్, సీపీఐ, ఏఐటీయూసీ రాష్ట్ర , జిల్లా, బీసీ సంఘాలు, గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం, ప్రజా సంఘాల నాయకులు, గ్రామ ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

నర్సయ్యయాదవ్ నేత్రాలు సజీవం
బొమ్మకల్ గ్రామానికి చెందిన కాల్వ నర్సయ్యయాదవ్ (52) నేత్రాలు సజీవంగా ఉన్నాయి. శనివారం రాత్రి లయన్ కాల్వ నర్సయ్యయాదవ్ గుండెపోటుతో మృతిచెందగా, వారి కుమారుడు శ్రీనివాస్‌ను లయన్స్ క్లబ్ ఆఫ్ బొమ్మకల్ సభ్యులు సంప్రదించారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆయన నేత్రాలను రేకుర్తి కంటి దవాఖాన సిబ్బంది ఇబ్రహీంం ద్వారా సేకరించి, హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించారు. కార్యక్రమంలో బొమ్మకల్ లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ లయన్ మిడిదొడ్డి కపిల్ మాదవ్, తోట కిరణ్, కాల్వ కనుకయ్య, చెట్టి జగన్, పి.శ్రీధర్, పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ, నర్సయ్య నేత్రాలు ఇద్దరికి చూపునిస్తాయ న్నారు. వారు భౌతికంగా మరణించిన వారి నేత్రాలు సజీవంగా ఉంటాయన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...