పేదింటి ఆడబిడ్డలకు సర్కారు అండ


Sun,July 7, 2019 01:00 AM

చొప్పదండి, నమస్తేతెలంగాణ: పేదింటి ఆడబిడ్డల పెళ్లికోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అమలుచేస్తూ అండగా నిలుస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలపరిషత్ కార్యాలయంలో మండలంలోని 54 మంది లబ్ధిదారులకు రూ.50 లక్షల 56వేల 916 విలువైన కల్యాణలక్ష్మీ చెక్కులను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో ఆడబిడ్డ పెళ్లి అంటే అప్పులకోసం తొక్కని గడప అంటూ ఉండేదికాదనీ, పెళ్లికోసం చేసిన అప్పును తీర్చేందుకు ఎన్నో కష్టాలు పడేవారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడపిల్ల పెళ్లి భారం కావద్దన్న ఉద్దేశంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని వివరించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతామన్నారు. నియోజకవర్గంలో కొద్ది రోజుల్లోనే సాగు, తాగునీటి సమస్య శాశ్వతంగా తీరుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఏమైనా సమస్యలున్నా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కుల విషయంలో ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా తనను సంప్రదించి, పనులు చేయించుకోవాలని సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎంపీపీ చిలుక రవి, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య, ఎంపీడీవో సంధ్యారాణి, తాసిల్దార్ శ్రీనివాస్, సర్పంచులు నాగిరెడ్డి, రవి, సురేశ్, లావణ్య, కో ఆప్షన్ పాషా, మాజీ ఎంపీపీలు వెల్మ మల్లారెడ్డి, వల్లాల క్రిష్ణహరి, టీఆర్‌ఎస్ నాయకులు ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, నలుమాచు రామక్రిష్ణ, మినుపాల తిరుపతిరావు, బందారపు అజయ్, ముసికె వెంకటరెడ్డి, గొల్లపల్లి శ్రావణ్, చేపూరి రవీందర్, లంబు సుధాకర్‌రెడ్డి, వడ్లకొండ శ్రీనివాస్, వడ్లూరి గంగరాజు, వడ్లూరి లచ్చయ్య, లంక లక్ష్మణ్, జహీర్, తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...