3,555 మంది సర్కారు బడికి..


Thu,June 20, 2019 03:10 AM

- బడిబాటలో చేరిన విద్యార్థుల సంఖ్య
- 1,756 మంది బాలురు.. 1,799 మంది బాలికలు..
- ఉపాధ్యాయుల కృషితో జిల్లాలో విజయవంతం
- ప్రజాప్రతినిధులు, చిన్నారుల తల్లిదండ్రుల సహకారం
పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు జిల్లాలో చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమం విజయవంతమైంది. ఈ నెల 14వ తేదీన ప్రారంభమైన కార్యక్రమం 19వ తేదీన ముగిసింది. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు వారం రోజుల పాటు ఇం టింటా తిరిగి 3,555 మంది పిల్లలను బళ్లలో చేర్పించారు. ఇందులో 1,756మంది బాలురు, 1,799 బాలికలున్నారు. అత్యధికంగా 1వ తరగతి, 6వ తరగతిలో వీరంతా ప్రవేశం పొందారు. తొలి రోజున ర్యాలీతో ప్రారంభమైన బడి బాటలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఎండలు కూడా లెక్క చేయకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతి రోజూ ఇంటింటికీ తిరుగుతూ బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించారు. జిల్లాలో కార్యక్రమం విజయవంతం కావ డంపై జిల్లా విద్యాశాఖ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తరగతుల వారీగా..
జిల్లావ్యాప్తంగా 3,555 మంది పిల్లలను సర్కారు బళ్లలో చేర్పించగా, ఒకటో తరగతిలో 1,290 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఇందులో 624 మంది బాలురు, 666 మంది బాలికలున్నారు. రెండో తరగతిలో 234మంది విద్యార్థులు ప్రభుత్వ బడిలో చేరగా, 114 మంది బాలురు, 120మంది బాలికలున్నారు. 110 మంది బాలురు, 91మంది బాలికలు కలిపి మొత్తం 201మంది విద్యార్థులు మూడవ తరగతిలో చేరారు. నాలుగో తరగతిలో 181 మంది విద్యార్థులు పాఠశాలల్లో చేరగా, 90 మంది బాలురు, 91 మంది బాలికలు అడ్మిషన్లు పొందారు. మొత్తం 141 మంది విద్యార్థులు ఐదో తరగతిలో ప్రవేశం పొందారు. ఇందులో 72 మంది బాలురు కాగా, 69మంది బాలికలున్నారు. 6వ తరగతిలో ప్రవేశం పొందిన 1,011 మంది విద్యార్థుల్లో 478 మంది బాలురు కాగా, 533 మంది బాలికలు. మొత్తం 206 మంది విద్యార్థులు 7వ తరగతిలో చేరగా 105 మంది బాలురు, 101 మంది బాలికలు ప్రవేశాలు పొందారు. ఇక 8వ తరగతిలో 103 మంది బాలురు, 86మంది బాలికలు కలిపి మొ త్తం 189 మంది అడ్మిషన్ తీసుకున్నారు. 9వ తరగతిలో 74మంది విద్యార్థులు చేరగా, ఇందులో 42 మంది బాలురు, 32మంది బాలికలున్నారు. ఇక 10వ తరగతిలో 18 మంది బాలురు, 10మంది బాలికలు మొత్తం 28మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...