సేవా దృక్పథాన్ని పెంపొందించుకోవాలి


Thu,June 20, 2019 03:09 AM

- ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలి
- పిల్లలంతా బడిలోనే ఉండేలా చూడాలి
- జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్‌రావు
కలెక్టరేట్ : విద్యార్థులు చదువుకునే దశ నుంచే మంచి సేవా దృక్పథాన్ని పెంపొందించుకోవాలని జిల్లా విద్యాశాధికారి వెంకటేశ్వర్‌రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో 60 మంది విద్యార్థులకు సమకూర్చిన నోట్‌బుక్‌లను డీఈఓ పంపిణీ చేశారు. అంతకు ముందు పట్టణంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులంతా డీఈఓతో కలిసి బడిబాట ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీఈఓ వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలను సమకూరుస్తూ మెరుగైన విద్యాబోధన అందేలా చూస్తుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతి సౌకర్యాలతో పాటు నిష్ణాతులైన ఉపాధ్యాయులు చేస్తున్న బోధనను అనుకరిస్తూ విద్యార్థులంతా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా ముందుకు సాగాలన్నారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సత్యసాయి సేవా సమితి సభ్యులు సేవా దృక్పథంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నోట్‌బుక్స్ అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మురళినాయక్, మంజులత, ఉపాధ్యాయులు సురేంద్రప్రసాద్, జ్యోతి, మల్లేశ్వరి, ఆంజనేయులు, సత్యసాయి సేవా సమితి సభ్యులు హన్మంతరావు, తొడుపునూరి వెంకటేశం, లక్ష్మణ్, వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...