సాధారణ ప్రసవాలు పెంచాలి


Thu,June 20, 2019 03:08 AM

-వైద్య విధాన పరిషత్ జాయింట్ డైరెక్టర్ డా.రాజేశం
ఫెర్టిలైజర్‌సిటీ : ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు పెంచేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర, పట్టణ ఆరోగ్య కేంద్ర సిబ్బంది సమన్వయంతో పని చేసి సాధారణ ప్రసవాలను పెంచాలని తెలంగాణ వైద్య విధాన పరిషత్ జాయింట్ డైరెక్టర్ డా.రాజేశం సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన గోదావరిఖనిలోని వంద పడకల దవాఖానలో జిల్లాలోని ఆరు పట్టణ ఆరోగ్య కేంద్రాలతోపాటు 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో నిర్వహించిన సమావేశానికి ముఖ్యతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలోనే సిజేరియన్లలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానం ఉంటే తెలంగాణలో పెద్దపల్లి జిల్లా నంబర్ వన్ ఉండడం దురదృష్టకరమన్నారు. తల్లీ, బిడ్డ ఆరోగ్యానికి సాధారణ ప్రసవాలు ఎంతో మేలు కలిగిస్తాయనీ, పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, దాని పరిధిలోకి వచ్చే అంగన్‌వాడీలు, ఆశ కార్యకర్తలు, గర్భిణులకు తగిన సలహాలు, సూచనలు ఇస్తూ సాధారణ ప్రసవానికి కృషి చేయాలని కోరారు.

గర్భిణులు మొదటి నెల నుంచే ఆయా ఆరోగ్య కేంద్రాల వైద్యులతో పాటు సిబ్బంది సలహాలు, సూచనలు పాటించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం సాధారణ ప్రసవాలు పెంచేందుకు ఎంతో కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం ఆ దిశగా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు కొనసాగేలా, అది కూడా సాధారణ ప్రసవాలు పెంచేలా సిబ్బందికి తర్ఫీదు ఇవ్వడంతోపాటు సహకారం అందిస్తుందనీ, ఆ దిశగా సిబ్బంది సమన్వయంతో పని చేసి సాధారణ ప్రసవాలకు తోడ్పాటు అందించాలన్నారు. అనంతరం ఆయన దవాఖానలో ప్రసవాల తీరుతోపాటు వివిధ ఆరోగ్య కేంద్రాల్లో వచ్చే గర్భిణుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట వైద్య విధాన పరిషత్ ప్రోగ్రాం అధికారి అశోక్‌కుమార్, మాతా శిశు వైద్య కార్యక్రమ అధికారి డా.శిల్పిని, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ప్రమోద్‌కుమార్, గోదావరిఖని మెడికల్ సూపరింటెండెంట్ డా.రమాకాంత్, శ్రీనివాస రెడ్డి, ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...