కన్నెపల్లిలో జడ్పీచైర్మన్ మధు


Wed,June 19, 2019 01:52 AM

కాళేశ్వరం : కన్నెపల్లి పంప్‌హౌస్‌ను జడ్పీ చైర్మన్ పుట్ట మధు సందర్శించారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం సాయంత్రం కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకొని అక్కడ జరుగుతున్న ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. వ్యూ పాయింట్ వద్ద నుంచి వెట్న్ స్థలాన్ని చూశారు. జడ్పీ చైర్మన్ హోదాలో మొదటి సారిగా ఆయన ఇక్కడ రాగా, అధికారు లు ఆయనుకు స్వాగతం పలికారు. అనంతరం హోమశాల వేదికను సందర్శించి పనులు త్వరగా చేయాలని సూచించారు. ఈ సందర్భంగా హో మం నిర్వహించే అర్చకులతో పుట్ట మధు చర్చించారు. హోమం సమయంలో సీఎం కేసీఆర్ ఎటువైపు కూర్చోవడం తదితర అంశాలపై చర్చించారు. ఆయన వెంట ఎంపీపీ రాణిబాయి, మహదేవపూర్ సర్పంచ్ శ్రీపతి బాపు, కాళేశ్వరం ఉమ సర్పంచ్ పవన్, నాయకులు మోహన్ రెడ్డి, రామారావు తదితరులు ఉన్నారు.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...