రెండో రోజూ అక్కడే


Wed,June 19, 2019 01:51 AM

- స్థానిక సమస్యలపై పట్టువిడువని ఎమ్మెల్యే కోరుకంటి
- ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో స్థానికులకే ఉద్యోగాలు..
- నవోదయ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్

గోదావరిఖని టౌన్: గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను, విద్య సమస్యను పరిష్కరించడానికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎంపీ వెంకటేశ్ నేతకాని సహకారంతో రెండో రోజు కూడా కేంద్రమంత్రులను కలిశారు. సోమవారం కేంద్ర రసాయన ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడను కలిసి ఆర్‌ఎఫ్‌సీఎల్ ఉద్యోగాల విషయంపై భేటీ అయ్యారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రాన్ని సమర్పించారు. స్థానికంగా విద్యార్హతలు కలిగిన వారికి ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన కోరారు. అలాగే ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఏర్పాటు చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థను రద్దు చేసి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ను కోరారు. గోదావరిఖని ప్రాంతంలో కార్మికుల పిల్లలకు ఉచిత విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. వీరి వెంట స్థానిక నాయకులు పీటీ స్వామి, పెంట రాజేశ్, మెతుకు దేవరాజు, బొడ్డు రవీందర్, చెల్కలపల్లి శ్రీనివాస్, జేవీ రాజు, పాముకుంట్ల భాస్కర్, కుంట సాయి, అంబటి నరేశ్ తదితరులున్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...