పవర్‌లూమ్ కార్మికుడి కుటుంబానికి మంత్రి భరోసా


Wed,June 19, 2019 01:51 AM

ధర్మారం: మండలంలోని నంది మేడారం గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు తుమ్మ తిరుపతి కుమారుడు అజయ్ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో పోస్టుపై రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పందించారు. సమస్యను పరిష్కరించాలని నూ తన ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ బలరాంరెడ్డిని పంపి సయోధ్య కుదిర్చారు. కార్మికుడి కుటుంబానికి భరోసా నిచ్చారు. వివరాల్లోకి వెళితే.. నందిమేడారం గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు తుమ్మ తిరుపతి, లత దంపతులు కలిసి సుమారు రూ. లక్షల వరకు వెచ్చించి పవర్‌లూమ్ యంత్రం కొనుగోలు చేశాడు. 3 నెలలుగా దానిని నడుపుకుంటూనే కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల కాలం నుంచి ఆ పవర్‌లూమ్ యంత్రాన్ని ధ్వంసం చేస్తామని కొందరు బెదిరిస్తున్నారు. దీంతో ఆందోళనకు గురైన చేనేత కార్మికుడు తిరుపతి కుమారుడు ఆ యంత్రాన్ని కనుక ధ్వంసం చేస్తే మా కుటుంబ సభ్యులందరం నంది మేడారం రిజర్వాయర్‌లో పడిచస్తాం అం టూ సోమవారం సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్టు చేయగా అది వైరల్ అయింది. ఆ పోస్టుపై మంత్రి ఈశ్వర్ తక్షణమే స్పందించారు.

సమస్యను పరిష్కరించాలని నూతనం ఎంపీపీ కరుణశ్రీబలరాంరెడ్డిని పంపించారు. దీంతో వారు వెంటనే నంది మేడారంలోని తిరుపతి ఇం టికి చేరుకుని విషయాన్ని తెలుసుకున్నారు. అదేవిధంగా చుట్టు పక్కలవారితో చర్చించారు. పవర్‌లూమ్ యంత్రం శబ్దంతో రాత్రి నిద్రకు భంగం వాటిల్లుతున్నదని, ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు నడుపుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వారు ఎంపీపీతో చెప్పారు. చుట్టుపక్కల వారి అభిప్రాయం మేరకు నడుచుకుంటామని తిరుపతి ఎంపీపీ ఎదుట అంగీకరించారు. తక్షణమే స్పందించిన మంత్రి ఈశ్వర్, సహకరించిన ఎంపీపీ కరుణశ్రీ బలరాంరెడ్డికి అజయ్ కృతజ్ఞత తెలిపారు. తిరుపతి కుటుంబానికి పద్మశాలి సంఘం నాయకులు వేముల రామ్మూర్తి, కూరపాటి శ్రీనివాస్ తదితర నాయకులు సంఘీభావం తెలిపారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...