సాగు, దిగుబడి తగ్గి.. ధరలు పెరిగి


Wed,June 19, 2019 01:51 AM

పెద్దపల్లిటౌన్: వాతావరణ పరిస్థితులతో కూరగాయల సాగు, దిగుబడి తగ్గడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. రోజురోజుకు మరింత ప్రియమవుతున్నాయి. బోరు, మోటా ర్ బావులు, చెరువులు, కుంటల్లో ఇప్పటికే తీవ్ర స్థాయిలో నీరు అడుగంటిపోయి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఉన్న కొన్ని నీళ్లతో రైతులు పండిస్తున్న కొత్తిమీర, పాలకూర, తోటకూర, చుక్క కూర, గోంగూర, పూదీన తదితర ఆకు కూరలకు డిమాండ్ ఉన్నా దిగుబడి ఆశించిన రావడంలేదు. దిగుబడిని ఎక్కువగా ఇచ్చే టమా ట, వంకాయ, కాకరకాయ, సోరకాయ లాంటి కూరగాయలు ఎండ వేడిమిని తట్టుకోలేక వాడిపోతున్నాయి. దీంతో ఆశించినంత కూరగాయల దిగుబడి రావడంలేదు. కూరగాయల ధరల పెరుగుదలతో మరో పక్క వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కిలో టమాటకు గతంలో 10 ఉండగా ప్రస్తుతం కిలో 50కి పెరిగింది. వంకాయ గతంలో 20 ఉండగా ప్రస్తుతం కిలో 40కి పెరిగింది. బెండకాయ గతంలో కిలో 20 ఉండగా ప్రస్తుతం కిలో 40కి పెరిగింది. పచ్చిమిర్చి గతంలో కిలో 30 ఉండగా ప్రస్తుతం కిలో 100, క్యారెట్ కిలోకు 40కి ఉండగా, ప్రస్తుతం 80, గోరుచిక్కుడు కిలో 40 ఉండగా ప్రస్తుతం 80కి, కాకరకాయ కిలో 40 ఉండగా ప్రస్తుతం 80కి పెరిగింది. క్యాప్సికమ్ కిలో 30 ఉండగా ప్రస్తుతం 80కి, పాలకూర, తోటకూరలకు 50కి పెరగగా, పుదీనా 150, కొత్తిమీరకు 100 వరకు ధరలు పెరిగాయి. వీటితో పాటు ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు అగచాట్లు పడుతున్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...