కోరుకంటి ఢిల్లీ బాట


Tue,June 18, 2019 01:07 AM

-స్థానిక సమస్యలపై అధికారులతో చర్చలు
-ఎరువుల కార్మాగారంలో స్థానికులకు ఉద్యోగాలివ్వాలని డిమాండ్
-ప్రైవేటు స్కూల్‌ను రద్దు చేసి, కేంద్రియ విద్యాలయాన్ని మంజూరు చేయాలని విన్నపం
-ఆర్‌ఎఫ్‌సీఎల్ సీఎండీ, అదనపు సెక్రెటరీని కలిసి విజ్ఞప్తి
గోదావరిఖని టౌన్: రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఢిల్లీ బాట పట్టారు. సోమవారం ఉదయం ఢిల్లీ చేరుకున్న ఆయన స్థానిక సమస్యలపై సంబంధిత మంత్రి, అధికారులతో చర్చించారు. గోదావరిఖని కేంద్రంలో నిర్మిస్తున్న ఆర్‌ఎఫ్‌సీఎల్ (రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్) ఎరువుల కర్మాగారంలో అర్హులైన స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్‌కుమార్ గ్యాంగ్‌వార్, ఆర్‌ఎఫ్‌సీఎల్ అడిషనల్ సెక్రెటరీ గురువింద్ సిద్ధుకు ఎంపీ వెంకటేశ్‌నేతతో కలిసి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ స్థానికంగా ఉన్నత విద్యార్హతలు ఉన్న యువత ఉద్యోగాల కోసం సుదూర ప్రాంతాలకు వలసపోతూ, కుటుంబాలకు దూరమవుతున్నారనీ, తక్కువ వేతనాలు, గ్యారంటీ లేని జాబ్‌లు చేయలేక ప్రత్యామ్నాయ అన్వేషణలో మగ్గిపోతున్నారని వారితో వివరించారు. ఈ క్రమంలో విద్యార్హత కలిగిన స్థానిక యువతకు ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో పర్మినెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. కాగా, తన విజ్ఞప్తికి సంబంధిత అధికారులు సానుకూలంగా స్పందించారని వివరించారు.

-టెక్నో స్కూల్‌ను రద్దు చేయాలి..
ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఏర్పాటు చేయడం సరికాదని చెప్పినట్లు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాలయాలు, గురుకులాలను ఏర్పాటు చేస్తున్న తరుణంలో నూతనంగా ఏర్పాటు చేసే పరిశ్రమలో అధిక ఫీజులు వసూలు చేసే కార్పొరేట్ విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం సరికాదనీ, ఆ స్కూల్‌ను రద్దు చేయాలనీ, ఆ స్థానంలో కేంద్రియ విద్యాలయాన్నీ చేయాలని కోరగా, సంబంధిత అధికారులు తన అభ్యర్థనను స్వీకరించినట్లు తెలిపారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...