ఘనంగా రావికంటి జయంతి


Tue,June 18, 2019 01:07 AM

మంథని, నమస్తే తెలంగాణ : ప్రజాకవి, మంత్రిపురి వేమన రావికంటి రామయ్య గుప్తా 83వ జయంతి వేడుకలను పట్టణంలోని వైశ్యులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక గాంధీ చౌక్‌లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిచారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ, సమాజ వికాసం కోసం, సమాజంలోని అసమానతలను ఎత్తి చూపుతూ రావికంటి రామయ్య గుప్తా రచించిన రచనలు అద్భుతమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు ఇల్లెందుల కిషోర్, వొల్లాల శంకర్‌లింగం, కొమురవెల్లి విజయ్ కుమార్, రావికంటి శ్రీనివాస్, వొల్లాల అశోక్, రావికంటి సదానందం, కేశెట్టి సతీశ్, ఇనుముల సతీష్, వీకే రవి, బత్తుల సత్యానాయణ, బోగోజు శ్రీనివాస్ ఉన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...