విద్యా కేంద్రంగా.. పెద్దపల్లి


Tue,June 18, 2019 01:07 AM

-అన్ని వర్గాలకూ చదువు అందించాలి
-అందుకోసమే గురుకులాల ఏర్పాటు
-పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
-రంగంపల్లిలో గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల ప్రారంభం
కలెక్టరేట్ : భవిష్యత్‌లో పెద్దపల్లిని విద్యాకేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. చదువుతోనే సమాజంలో మార్పు వస్తుందనీ, అలాంటి విద్యను అన్ని వర్గాలకూ చేరువచేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేశారని చెప్పారు.

పెద్దపల్లి మండలం రంగంపల్లిలోని సహజ స్కూల్ ఆఫ్ బిజినెస్ కళాశాల భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతి రావ్ ఫూలే బీసీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను ఆయన సోమవారం ప్రారంభించారు. ఫూలే దంపతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి, ఘనంగా నివిళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫూలే దంపతుల ఆశయాలను కొనసాగించేందుకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ మహాత్మా జ్యోతి రావ్ ఫూలే బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల పేరుతో 2017-18 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 119 గురుకులాలలను ప్రారంభించారని గుర్తు చేశారు.

ఈ సమయంలో జిల్లాలో మూడు పాఠశాలలను ఏర్పాటు చేశారనీ, తాజాగా మళ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున మరో మూడు పాఠశాలలు మంజూరయ్యాయని తెలిపారు. ఇందులో భాగంగానే పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించిన బాలికల పాఠశాలను రంగంపల్లిలో ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. అన్ని వర్గాలకూ కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించాలన్న గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ మైనార్టీలు, వెనుకబడిన తరగతులకు గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులను ప్రయోజకులుగా చేసేందుకు ఉపాధ్యాయ వర్గమంతా సమష్టిగా పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ కే రత్నాకర్, ఎంఈఓ సురేందర్, కౌన్సిలర్ ఉప్పు రాజ్‌కుమార్, ఏటీపీలు స్వరూపరాణి, మంజుల, డిప్యూటీ వార్డెన్లు శ్వేత, సంధ్యారాణి, ఉపాధ్యాయులు శైలజ, జ్యోతి, సరిత, రాధిక, సుజాత, రెబేకా, నాయకులు బండారి రామ్మూర్తి, ఎంపీటీసీ వైద శ్రీనివాస్, కొండి సతీశ్ తదితరులు పాల్గొన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...