జిల్లావాసులకు ఓయూ డాక్టరేట్లు


Tue,June 18, 2019 01:07 AM

ఓదెల: ఓదెల మండలం కొలనూర్ గ్రామానికి చెందిన మొదుంపల్లి సంపత్ ఉస్మానియా యూనివర్సిటీ హిందీ విభాగంలో పీహెచ్‌డీ డాక్టరేట్‌ను సోమవారం అందుకున్నారు. అంతిమ్ దో దశక్ కే హిందీ ఉపన్యాసోమే వైచరిక్ చేతన (చివరి రెండు దశాబ్దాల హిందీ నవలల్లో సైద్ధ్దాంతిక చైతన్యం 1981-2000) అనే అంశంపైన ఓయూ ప్రొఫెసర్ అనిత పర్యవేక్షణలో చేసిన పరిశోధనకు గాను ఓయూ పరీక్షల విభాగం సంపత్‌కు డాక్టరేట్ ప్రకటించింది. ఆ పట్టాను ఓయూ 80వ స్నాతకోత్సవంలో సోమవారం రాష్ట్ర గవర్నర్ ఈ ఎస్ ఎల్ ఎన్ నరసింహన్, ఓయూ వీసీ రాంచంద్రం, ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ నుంచి సంపత్ పీహెచ్‌డీ అందుకున్నారు. నిరుపేద దళిత కుటుంబానికి చెందిన సంపత్‌కు డాక్టరేట్ రావడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. సర్పంచ్ సామ మణెమ్మ, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి, అంబేద్కర్ సంఘ జిల్లా నాయకుడు మాటూరి రత్నం సంపత్‌కు అభినందనలు తెలిపారు.

అన్నదమ్ములకు..
మంథని రూరల్: గాజులపల్లికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు పీహెచ్‌డీ పూర్తి చేసుకోగా గవర్నర్ ఈఎస్‌ఎల్‌నర్సింహన్ నుంచి పట్టాను అందుకున్నారు.ఈ మేరకు గాజులపల్లి గ్రామానికి చెందిన దొమ్మటి రవి మంథని పట్టణంలోని బాయ్స్ హై స్కూల్‌లో పీఈటీగా పని చేస్తున్నాడు. అదే విధంగా ఆయన సోదరుడు దొమ్మటి దేవేందర్ హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో ఎకనామిక్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. కాగా దొమ్మటి రవి 2016లో వ్యాయామ విద్యలో పీహెచ్‌డీ పూర్తి చేయగా, ఆయన సోదరుడు దేవేందర్ 2017లో ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో ఉస్మానియ యూనివర్సిటీ 80వ వార్షికోత్సం సందర్భంగా 2013 నుంచి ఇప్పటి దాకా పీహెచ్‌డీ పూర్తి చేసుకున్న స్కాలర్స్‌కు ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో గవర్నర్ నుంచి పట్టాను అందుకున్నారు.ఈ సందర్భంగా రవి, దేవేందర్ మాట్లాడుతూ, చిన్న తనం నుంచి విద్యా బుద్ధులు నేర్పించిన గురువులకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, శ్రేయెభిలాషులు, తమ అభివృద్ధికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ఈ పట్టాను అంకింతం ఇస్తున్నట్లు వివరించారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...