జీవాలకు నట్టల నివారణ మందు


Tue,June 18, 2019 01:06 AM

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడానికి ప్రభుత్వం 75 శాతం రాయితీపై గొల్ల, కుర్మలకు గొర్రెలను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే, గొర్రెలు, మేకలకు నట్టల వ్యాధి రావడంతో గొర్రెలు, మేకల కాపరులు ప్రతియేటా పెద్ద ఎత్తున జీవాలను కొల్పోతున్నారు. ఈ నేపథ్యంలో నట్టల నివారణ కోసం ప్రభుత్వం ప్రతి ఏటా రెండు సార్లు ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ చేస్తుండగా, నేటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు జిల్లాలో నట్టల నివారణ మందుల పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని 8,75,473 జీవాలకు నట్టల నివారణ మందులు వేయడానికి చర్యలు చేపట్టింది.

నేటి నుంచి ప్రారంభం..
జిల్లాలోని గొర్రెలు, మేకలకు నేటి నుంచి ఉచిత నట్టల నివారణ మందులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ నెల 25వ తేది వరకు జిల్లాలోని మేకలు, గొర్రెలకు పశు సంవర్ధక శాఖ అధికారులు ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం ఆయా గ్రామాల్లో నేటి నుంచి నట్టల నివారణ మందు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని 7,41,496 గొర్రెలు ఉండగా, మేకలు 1,33,937 ఉన్నాయి. జిల్లాలో గొర్రెలు, మేకలు మొత్తం కలిపి 8,75,473 గొర్రెలు, మేకలు ఉండగా వారం రోజుల పాటు ఉచితంగా నట్టల నివారణ మందులు పంపిణీ చేస్తున్నారు. ఇందు కోసం 28 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...