చెరువులో పడి విద్యార్థి మృతి


Tue,June 18, 2019 01:06 AM

ఓదెల : రూప్‌నారాయణ పేట గ్రామంలోని చెరువు నీటిలో పడి బీమరి ప్రశాంత్(10) సోమవారం మృతి చెందినట్లు పొత్కపల్లి హెడ్‌కానిస్టేబుల్ సుధాకర్ పేర్కొన్నారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బీమరిపల్లి గ్రామానికి చెందిన ప్రశాంత్ అమ్మమ్మ వాళ్ల ఇంటిలో శుభకార్యం కోసం రూపునారాయణ పేట గ్రామానికి వచ్చాడు. బహిర్భూమికి మరో సోదరుడు శివతో కలిసి చెరువు వద్దకు వెళ్లారు. ప్రశాంత్ వాటర్ బాటిల్‌లో నీళ్లు తీసుకురావడానికి వెళ్లగా కాలు జారీ నీటిలో పడ్డాడు. గమనించిన సోదరుడు ఇంటికి వెళ్లి తెల్పగా, వెంటనే చెరువు వద్దకు కుటుంబ సభ్యులు వచ్చి చూడగా మృతి చెందాడు. చెరువులో గతంలో ఎక్స్‌కవేటర్‌తో తీసిన పెద్ద గుంత ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ప్రశాంత్ కొమిర పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. కొడుకు, కూతురు ఉండగా కొడుకు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. తండ్రి సంపత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...