ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పనుల్లో వేగం పెంచాలి


Sun,June 16, 2019 03:09 AM

-కలెక్టర్‌ శ్రీదేవసేన
-కర్మాగారంలో తనిఖీలు
-అధికారులతో సమీక్ష
ఫెర్టిలైజర్‌సిటీ : రామగుండంలో నిర్మిస్తున్న ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ శ్రీదేవసేన సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఆమె ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కర్మాగా రం నిర్మాణ పనులను తనిఖీచేశారు. అనంతరం కర్మాగారంలోని సమావేశ మందిరంలో అధికారులతో పనుల ప్రగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కర్మాగారం పూర్తయితే అనేక మంది కార్మికులకు ఉపాధితోపాటు రైతులకు ఎరువుల కొరత లేకుం డా ఉంటుందన్నారు. రూ.5240.80 కోట్లతో ప్రభుత్వం ఈ కర్మాగారాన్ని పునరుద్ధరిస్తున్నదని తెలిపారు. కర్మాగారంలో ఉత్పత్తి ప్రారంభం కావ డం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చాలా కీలకమనీ, అందుకే రెండు ప్రభుత్వాలు పనుల పురోగతిపై ఆ సక్తితో ఉన్నాయని చెప్పారు. దీనిని దృష్టిలో ఉం చుకొని పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ప్రభుత్వం ఇప్పటికే 6 నెలల సమయం పొడిగించిందనీ, మరోసారి పొడిగింపు కుదరదని పేర్కొన్నారు. రాష్ట్ర సీఎస్‌ కూడా పనుల పురోగతిపై నివేదిక కోరినట్లు చెప్పారు. కర్మాగారానికి అవసరమై న గ్యాస్‌ సరఫరా కోసం తాడేపల్లి గూడెం నుంచి వేస్తున్న 365 కి.మీ గ్యాస్‌ పైపులైను పనులు చివ రి దశకు చేరుకున్నాయని అధికారులు కలెక్టర్‌కు వివరించగా, జూలై చివరి నాటికి గ్యాస్‌ పైపులైను పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. పైపులైన్‌ పురోగతిపై ఎరువుల కర్మాగార ఉన్నతాధికారులతో కలెక్టర్‌ ఫోన్లో మాట్లాడి, జూలై చివరి నాటికి హైడ్రో టెస్టిం గ్‌ కూడా పూర్తి చేయాలని చెప్పారు.

గ్యాస్‌ పైపులైను వేయడంలో పక్క రాష్ట్రంలో సమస్యలుంటే తెలియజేయాలనీ, ఉన్నతాధికారులతో చర్చించి వాటిని పరిష్కరిస్తామన్నారు. గ్యాస్‌ పైప్‌ పనులకు సమాంతరంగా నీటి సరఫరా, వాటర్‌ ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన పనులు పూర్తిచే యాలనీ, అవసరమైన యంత్రాలను పూర్తి స్థాయి లో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. డిసెంబర్‌లోగా ఎరువుల కర్మాగారం పనులు పూర్తి చేసుకుని, ఉత్పత్తి ప్రారంభించాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ప్రతి రోజూ 8వేల టన్నుల యూరియా తయారు చేసేలా యూనిట్‌లో పనులు చేస్తున్నామని తెలిపారు. అనంతరం అధకారులు మాట్లాడుతూ ఎరువుల కర్మాగారానికి ఎల్లంపల్లి నుంచి నీరు అందించడానికి పైప్‌లైన్‌ నిర్మించామనీ, దాని ద్వారా రేపటి నుంచి నీరు సరఫరా చేస్తామని ఈఈ తెలిపారు. డిసెంబర్‌ 2019 చివరి నాటికి పూర్తి స్థాయి నిర్మాణాలు చేయడానికి 92 శాతం మేర పనులు జరగాల్సి ఉండగా, ఇప్పటివరకు 90.90 శాతం పనులు జరిగాయని వివరించారు. నిర్వహణ కోసం అవసరమైన 40 మెగావాట్ల మేర విద్యుత్‌ పనులు పూర్తి చేశామన్నారు. అనంతరం కర్మాగారంలో ఎలక్ట్రికల్‌, స్విచ్‌ యా ర్డు, ఇతరత్రా నిర్మాణాలను కలెక్టర్‌ పరిశీలించా రు. ఆమె వెంట కర్మాగార చీఫ్‌ మేనేజర్‌ ఎస్‌కే జా వా, డీజీఎం విజయ్‌కుమార్‌ బంగార్‌, చీఫ్‌ మేనేజర్‌ సోమనాథ్‌ అధికారులు ఉన్నారు.

102
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...