సీఎంఆర్‌ఎఫ్‌.. పేదలకు వరం


Sun,June 16, 2019 03:07 AM

-రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌
-19 మంది లబ్ధిదారులకు చెక్కుల అందజేత
గోదావరిఖని టౌన్‌ : నిరుపేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ పథకం కొండంత ధైర్యం ఇస్తుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు. గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 19 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.5,54,500ల విలువ గల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. బోనాల భారతమ్మకు రూ.37వేలు, ఎండీ జిలానీకి రూ.30వేలు, బీ యుగేంధర్‌కు రూ.60వేలు, ఎస్‌ సురేశ్‌కు రూ.12వేలు, బీ రాజమ్మకు రూ.44వేలు, ఎల్‌ సరితకు రూ.45వేలు, మణెమ్మకు రూ.7వేలు, ఎం వరుణసుధకు రూ.9,500లు, సీహెచ్‌ శ్రవంతికి 14వేలు, రవి గౌడ్‌కు రూ.47వేలు, డీ సంధ్యకు రూ.60వేలు, బీ సురేశ్‌కు రూ.26,500, టీ కుమార్‌కు రూ.60వేలు, మధునమ్మకు రూ.37,500, రాజిరెడ్డికి రూ.18వేలు, ఎం వెంకటేశ్‌కు రూ.10,500 విలువైన చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కార్పొరేట్‌ దవాఖానల్లో వైద్యం చేయించుకోలేని ఎంతోమంది మధ్య తరగతి ప్రజలకు ఈ పథకం వరంలాంటిదన్నారు. అందుకు కృతజ్ఞతగా ప్రజలంతా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఎమ్మెల్యే చందర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, నాయకులు బొమ్మగాని తిరుపతి, అచ్చ వేణు, భూమయ్య, ఆడెపు శ్రీనివాస్‌, నూతి తిరుపతి, మెతుకు దేవరాజు, చిన్నమూల విజయ్‌కుమార్‌, కాల్వ శ్రీనివాస్‌, చింతల నవీన్‌, కొండల్‌ రావు, జ్యోతి, గాజే సతీశ్‌, అఖిలేష్‌ గౌడ్‌ తదితరులున్నారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...