ప్రొఫెషనల్‌ ట్యాక్స్‌ రద్దు చేయాలి


Sun,June 16, 2019 03:07 AM

కలెక్టరేట్‌: తమపై ప్రవేశపెట్టిన ప్రొఫెషనల్‌ ట్యాక్స్‌ రద్దు చేయాలని కోరుతూ శనివారం ఎల్‌ఐసీ ఏజెంట్లు జిల్లా కేంద్రంలోని ఆ సంస్థ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రొఫెషనల్‌ ట్యాక్స్‌ విధానంతో నాలుగేళ్లకు రూ. 10వేల చొ ప్పున కమీషన్‌ రికవరీకి జోనల్‌ మేనేజర్‌ ఆదేశించారనీ, అందులో రూ. 2500ను మే 2019లో రికవరీ చేశారని చెప్పారు. ఎలాంటి ఉద్యోగాలు లే ని కారణంగానే ఎల్‌ఐసీ ఏజెంట్లుగా పని చేస్తున్న తమకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఈఎస్‌ఐ, పీఎఫ్‌, జీపీఎఫ్‌ లాంటి సౌకర్యాలను వర్తింపజేయాలని కోరారు. కమీషన్‌పై కుటుంబాలను పోషించుకుంటున్న తమను ఆదుకుంటూ ప్రొఫెషనల్‌ ట్యాక్స్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఎల్‌ఐసీ ఏజెంట్లు జిల్లా కేంద్రంలోని దాసరి క్యాంపు కార్యాలయానికి చేరుకొని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఎల్‌ఐసీ ఏజెంట్ల సంఘం అధ్యక్షుడు సాగి ప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి సుభాష్‌ తివారీ, కోశాధికారి ఎస్‌ మల్లయ్య గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...